నాగ శౌర్య-అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ వెనుక పెద్ద కథే ఉంది!
టాలీవుడ్ నటుడు నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల నడుమ ఈ పెళ్లి వేడుక జరిగింది. పురోహితుల వేద మంత్రాల నడుమ నాగశౌర్య, అనూష మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. అంతకు ముందు రోజు అంటే నవంబర్ 19న బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మెహందీ, కాక్ టెయిల్ నైట్‌ను నిర్వహించారు. ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పార్టీకి హాజరైన వారంతా ఆటా పాటలతో ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. మూడు స్టెప్స్ కలిగిన ఈ కేక్ పార్టీకి హాజరైన వారిని ఎంతో ఆకట్టుకుంది.
కేవలం ఒకరోజు ముందే కేక్ కోసం ఆర్టర్
తాజాగా ఈ కేకు తయారీ కోసం తాము పడ్డ శ్రమ గురించి బేకర్ శుభ కుశలప్ప వెల్లడించారు. కాక్ టెయిల్ పార్టీకి కేవలం ఒక రోజు ముందే కేక్ కు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఫ్యాన్సీ కేక్ ను తయారు చేయడం సాధ్యం కాదన్నారు. అయితే, అనూషతో తమకు ఉన్న సత్సంబంధాల కారణంగా కాదనలేకపోయినట్లు ఆమె వెల్లడించారు.
అనూష మాట కాదనలేక కేక్ తయారు చేశాం!
ఈ కేక్ గురించి ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. “తెలుగు నటుడు నాగశౌర్య, అతడికి కాబోయే సతీమణి అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ కోస కేవలం ఒకరోజు ముందే ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మేము చాలా హడావిడిగా ఉన్నాం. వధువు కొంత కాలంగా మా క్లయింట్. అయినా, ఒక్క రోజులో ఇలాంటి కేక్ తయారు చేయడం అంత సులువైన విషయం కాదు. అయినా, మేము తనకు నో చెప్పలేకపోయాం. పార్టీ డిస్కో డెకరేషన్ కు సరిపోయేలా ఈ పింక్ కేక్ ను రూపొందించడంలో సాయం చేసిన మా టీమ్ కు కృతజ్ఞతలు” అని శుభ కుశలప్ప తెలిపారు.
ఇక నాగ శౌర్య, అనూష శెట్టి నవంబర్ 20 న ఉదయం 11:25 గంటలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు.కుటుంబ సభ్యులు, కొంత మంది బంధు, మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.
Read Also: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగశౌర్య-అనూష, నెట్టింట వైరల్ అవుతున్నవెడ్డింగ్ వీడియో!