2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినిమా స్టార్స్, క్రికెటర్స్ ఇలా చాలా మంది 'పుష్ప' సాంగ్స్ కి డాన్స్ చేస్తూ.. సినిమాలో డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. 'తగ్గేదేలే' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


ఇక శ్రీవల్లి అనే సాంగ్ కి బన్నీ వేసిన స్టెప్స్ ను అందరూ ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఓ బుడ్డోడు ఈ పాటకు డాన్స్ చేస్తూ కనిపించాడు. బన్నీ మాదిరి భుజాన్ని పైకెత్తి డాన్స్ చేసి అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క వీడియోనే కాదు.. చాలా మంది చిన్న పిల్లలు బన్నీలా డాన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఈ వీడియోలను 'పుష్ప' టీమ్ తమ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తుంది. 










ఓపక్క ఈ సినిమాకి ఇంత పాపులారిటీ వస్తుంటే.. మరోపక్క కొందరు ప్రముఖులు ఈ సినిమాను తప్పుబడుతున్నారు. రీసెంట్ గా గరికిపాటి ఈ సినిమాపై ఫైర్ అయ్యారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆయన 'పుష్ప'లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడం వలన సమాజం చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఇడియట్', 'రౌడీ' పేర్లతో సినిమాలను తెరకెక్కించడం వలన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామని ఆయన ప్రశ్నించారు. సినిమాలో హీరోతో పనికిమాలిన పనులు చేయించడం వలన సమాజం ఎఫెక్ట్ అవ్వదా అంటూ మండిపడ్డారు.