జేమ్స్ కామెరాన్.. ఈ పేరు వింటే మన కళ్ల ముందు ‘టెర్మినేటర్’ మూవీ సీరిస్, ‘టైటానిక్’ వంటి అద్భుతమైన సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాలు ఇప్పటికీ కళ్లల్లో కదలాడుతూనే ఉంటాయంటే.. దాన్ని ఎంత చక్కగా స్క్రీన్‌పై ప్రజంట్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాటిని సినిమాలు అనడం కంటే విజువల్ వండర్స్ అనడమే కరెక్ట్. అయితే, ఆ అద్భుతాలకు మించిన మరో అద్భుతాన్ని సృష్టించడం జేమ్స్ కామెరాన్ వల్లే సాధ్యమైంది. అదే ‘అవతార్’. 13 ఏళ్ల కిందట రికార్డుల వరద పారించిన ‘అవతార్’ సీక్వెల్ మరోసారి బాక్సాఫీసులను బద్దలకొట్టేందుకు వచ్చేసింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. మరి ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమేమి అనుకుంటున్నారో చూసేద్దామా. 






























‘అవతార్-2’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు: 


❤  1994లోనే జేమ్స్ కామెరూన్ అవతార్‌ను రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. 
❤ 1997లో టైటానిక్ పూర్తయ్యాక అవతార్‌ను తీసి.. 1999లో రిలీజ్ చేయాలనేది కామెరూన్ ప్లాన్. దానికి అప్పట్లోనే 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. 
❤ కానీ, అప్పట్లో ఉన్న టెక్నాలజీతో ‘అవతార్‌’ను అనుకున్నట్లు తీయలేనని కామెరూన్‌కు అర్థమైంది. అందుకే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మొదలు పెట్టారు. 
❤ అవతార్ సినిమా షూటింగ్ కేవలం 62 రోజులు మాత్రమే జరిగింది. ఇందులో 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించగా.. మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫొటోగ్రఫీ ద్వారా తీశారు. 
❤  ఓ సారి పండోరా వరల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక అప్ గ్రేడ్ చేసుకుంటూ వెళుతూ వస్తున్నారు. అలా ‘అవతార్ 2’ కోసం ప్రత్యేకంగా ఓ వాటర్ వరల్డ్ క్రియేట్ చేశారు.
❤ అవతార్ 2 RealD 3D, Dolby Cinema, IMAX, IMAX 3D, Dolby Vision ఫార్మాట్స్ లో విడుదలవుతోంది. 
❤ లండన్ లో డిసెంబర్ 6న ప్రీమియర్ అయ్యింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ డేట్ మాత్రం డిసెంబర్ 16. లండన్ ప్రీమియర్ షో చూసిన వాళ్లంతా తమ జీవితంలో ఇదో అద్భుతమంటూ ‘అవతార్ 2’ను ప్రశంసిస్తున్నారు. 
❤ అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింత వింత జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
❤ అయితే జేమ్స్ కామెరూన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాల్లో చూసిన ప్రదేశాలు ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. ‘అవతార్’తో పోల్చితే.. ‘అవతార్-2’ మరింత అద్భుతంగా ఉందనే టాక్ నడుస్తోంది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి. 


Also Read: ‘అవతార్ 2’కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!