యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన వాడైనా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆయన, ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడూ నటిస్తూనే ఉన్నారు. అర్జున్ అడుగ జాడల్లోనే నడుస్తోంది ఆయన కూతురు ఐశ్వర్య. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.    


త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అర్జున్


కాసేపు ఐశ్వర్య సినిమాల విషయాన్ని పక్కన పెడితే, ఆమె త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. అదీ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతోంది. తమిళ హాస్య నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఉమాపతితో ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, పెళ్లికి అందరూ ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.






2017లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఉమాపతి


తండ్రి తంబి రామయ్య సినిమా పరిశ్రమలో కొనసాగడంతో ఉమాపతి కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2017లో సినిమా రంగంలోకి వచ్చాడు.  ‘అడగపట్టత్తు మగజనంగళయ్‌’ చిత్రంతో వెండితెరపై దర్శనం ఇచ్చాడు.  కోలీవుడ్ లో ఇప్పటి వరకు  4 సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘దేవదాస్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది.  






హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య


ఐశ్వర్య 2013లో సినీ కెరీర్ మొదలు పెట్టింది. ‘పట్టతు యానై’ అనే యాక్షన్, కామెడీ మూవీతో సినిమా రంగంలోకి  అడుగు పెట్టింది. ఈ చిత్రంలో విశాల్ తో కలిసి నటించింది. తొలి సినిమాతో ఫర్వాలేదు అనిపించింది. ఈ చిత్రం తర్వాత తండ్రి అర్జున్ దర్శకత్వం వహించిన ‘ప్రేమ బరాహ’ మూవీలో నటించింది. 2018లో తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా కన్నడలో మంచి హిట్ అందుకోగా, తమిళంలో ఫర్వాలేదు అనిపించింది.  మంచి వసూళ్లు సాధించగా.. తమిళంలో యావరేజ్‌గా ఆడింది. రీసెంట్ గా అర్జున్ తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా తెలుగులో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఈ చిత్రానికి అర్జునే దర్శకత్వం వహించాలి అనుకున్నారు. హీరోగా విశ్వక్ సేన్ ను ఎంపిక చేశారు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. హీరోతో అర్జున్ విభేదాల కారణంగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ విశ్వక్ సేన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పట్ల ఆయనకు డెడికేషన్ లేదంటూ మండిపడ్డారు.  






Read Also: ‘స్పై’ to ‘సామజవరగమన’- జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial