టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండదు. ఎప్పుడోగాని పోస్టు పెట్టదు. చాలా రోజుల తరువాత ఆమె ఒక పోస్టు పెట్టింది. ఒక పాట యూట్యూబ్ లింకును ఆమె తన ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అందులో ‘నా ప్రియమైన మిత్రుడు నందన్ గౌతమ్ రాసి ఒక అందమైన పాట ఇది. ఇది చూస్తే  హృదయం వెచ్చగా మారుతుంది, మనందరం భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు, కానీ సంగీతానికి ఆ అవరోధాలేవీ లేవు. అందమైన ప్రకృతి, మానవత్వం, సంగీతం అన్నిచోట్లా ఒకేలా ఉంటాయి’ అని క్యాప్షన్ పెట్టింది. అనుష్క అభిమానులు ఒక్కొక్కరూ ఆ లింకుపై క్లిక్ చేసి ఆ పాటను ఆస్వాదిస్తున్నారు. 


ఆ పాటకు నందన్ గౌతమ్ ‘స్పిరిట్ ఆఫ్ ల్యాండ్’ అని పేరు పెట్టాడు. ఆ పాటను అజర్ బైజాన్ ప్రజలకు అంకిత చేశాడు నందన్. ఆ పాటలో ఆ దేశం అందాలను ఇంకా సుందరంగా చూపించారు. దీనికి సంగీతం అందించింది నందన్ గౌతమ్ కాగా, పాడింది మాత్రం రేవనే గురుబోనవే, కెనన్ బషిర్లి. ఈ పాటను చూసిన వారు అందులో కనిపించే ప్రకృతి అందాలకు ఫిదా అయిపోవడం ఖాయం. అందుకేనేమో స్వీటీ ప్ర్యతేకంగా ఈ పోస్టును పెట్టింది అని మెచ్చుకోకుండా ఉండలేరు.   కొండలు కోనలు, జలపాతాలు, ఆ ప్రజల ముఖాల్లోని అమాయకత్వం, అందమైన నవ్వులు, డ్యాన్సులు .... నిజంగా అదిరిపోయేలా ఉంది. ఈ పాట చూసిన వారు కచ్చితంగా అజర్ బైజాన్ దేశాన్ని చూడాలని తహతహలాడుతారు.