2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ ఇలా చాలా మంది 'పుష్ప' సాంగ్స్ కి డాన్స్ చేస్తూ.. సినిమాలో డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. 'తగ్గేదేలే' అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇక శ్రీవల్లి అనే సాంగ్ కి బన్నీ వేసిన స్టెప్స్ ను అందరూ అనుకరిస్తూ డాన్స్ లు చేస్తున్నారు.


మొన్నామధ్య ఓ బుడ్డోడు శ్రీవల్లి సాంగ్ కి డాన్స్ చేసి అలరించాడు. ఇప్పుడు ఎనభై ఏళ్ల నటుడి తల్లి డాన్స్ చేయడం విశేషం. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో అనుపమ్ తల్లి 'శ్రీవల్లి' సాంగ్ కి స్టెప్పులేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


'పుష్ప' సినిమా విడుదలైన రెండు నెలలు గడుస్తున్నా.. క్రేజ్‌ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థమవుతుంది.  ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.