యాంకరింగ్‌కు బ్రేక్ తీసుకుంటున్నానని సుమ ఇటీవల ఓ షోలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అభిమానులంతా తెగ బాధపడిపోయారు. సుమా కనిపించని ఈ టీవీలెందుకు అంటూ డీలాపడిపోయారు. అయితే, ఆమె బ్రేక్ ఇస్తున్నది యాంకరింగ్‌కు కాదు.. ‘క్యాష్’ షోకు అని తెలిసి అంతా షాకయ్యారు. ఔనండి, సుమా ‘క్యాష్’కు విరామం ఇచ్చి.. ప్రత్యేకంగా ఒక అడ్డా క్రియేట్ చేసుకుంది. అదే ‘సుమా అడ్డా’.
తెలుగు బుల్లి తెరపై యాంకరింగ్‌లో మకుటం లేని మహారాణిలా ఎప్పుడూ వెలుగుపోతూ ఉంటుంది యాంకర్ సుమ కనకాల. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నా.. తెలుగులో ఇప్పటికీ టాప్ యాంకర్‌గానే కొనసాగుతోంది. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో చేసినా తర్వాత యాంకరింగ్ నే కెరీర్ గా మార్చుకుంది. మలయాళీ అమ్మాయిగా తెలుగువారికి పరిచయమై, తెలుగు టీవీ ఇండస్ట్రీలో స్టార్ మహిళ అనిపించుకుంది. తాజాగా ‘సుమ అడ్డా’ అంటూ మరో కొత్త ప్రోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చింది సుమ. ఆ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కొత్త ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ లో పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. అందులో అలీ, పోసాని కృష్ణ మురళి, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ‘కల్యాణం కమనీయం’ చిత్ర బృందం సందడి చేశారు.
ప్రోమో చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ప్రోమో లో యాంకర్ సుమ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో చేసిన ఇంటర్వ్యూ ఫన్నీ గా సాగింది. అలాగే నటుడు అలీతో ఇంటర్వ్యూ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి తో షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారట ఎందుకు అని అలీని అడిగింది సుమ. దానికి అలీ స్పందిస్తూ.. షూటింగ్ సమయంలో తాను చిరంజీవి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడనని, అలా చూస్తే ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్ తో నవ్వించేస్తారని చెప్పారు. ఎప్పుడు షూటింగ్ జరిగినా అలా సరదాగా ఒకరిని ఒకరు నవ్వించుకుంటామని అన్నారు. ఇక ప్రోమో చూస్తుంటే ప్రోగ్రామ్ మొత్తం ఫుల్ జోష్ తో నడించిందనిపిస్తుంది. ప్రోమో బాగుండటం, అలాగే సుమ చేస్తున్న కొత్త టాక్ షో కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది.
Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'
అయితే ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్ లో సుమ యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. సుమ కు ఏమైంది? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటోంది అంటూ సుమ అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు. అయితే తర్వాత సుమ స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ దానిపై క్లారిటీ ఇచ్చింది. తాను యాంకరింగ్ నుంచి తప్పుకోవడం లేదని, అదంతా నిజం కాదని చెప్పింది. తాను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను, యాంకరింగ్ వదిలేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ వార్తలకు చెక్ పడింది. అయితే తాజాగా ప్రారంభమౌతున్న ఈ కొత్త టాక్ షో జనవరి 7 నుంచి ప్రముఖ ఛానల్ లో ప్రసారం కానుంది. అంతకముందు ‘క్యాష్’ ప్రోగ్రామ్ ప్రసారం అయ్యే సమయంలో ఇప్పుడు కొత్తగా ఈ టాక్ షో ను ప్రసారం చేయనున్నారు. అయితే ‘క్యాష్’ ప్రోగ్రామ్ ను పూర్తిగా తొలగిస్తారా లేదా అనేది చూడాలి. ఇటీవల టాక్ షో లకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. అదే ఛానెల్ లో గతంలో నటుడు అలీ చేసిన ‘అలీతో సరదాగా’ టాక్ షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ కొత్త టాక్ షో కూడా బుల్లితెర ప్రేక్షకలను ఆకట్టుకుంటోందో చూడాలి.