యాంకర్ శ్రీముఖి ఎక్కడ ఉంటే.. అక్కడే వినోదం అనే సంగతి తెలిసిందే. ఆమె ఎనర్జీని తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌‌గా ఉండే ‘పటాస్’ భామ.. ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’తో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఈ సినిమాపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో తప్పకుండా ‘క్రేజ్’ పెరుగుతుందని అంతా భావించారు. ఆ నిరసనలే సినిమాకు ప్లస్ అవుతాయని ఆశించారు. కానీ.. ఊహించిన స్థాయిలో ‘క్రేజీ అంకుల్స్’ హిట్ కొట్టలేదు. తాజాగా ఆమె ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని వంటలక్క అవతారం ఎత్తింది. అదేంటీ.. ప్రేమి విశ్వనాథ్ స్థానంలో శ్రీముఖిని పెడుతున్నారా అనే మాత్రం అస్సలు ఊహించుకోవద్దు. అది ఎప్పటికీ జరగని పని. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీముఖి చేసిన రీల్ వీడియో. 


ఈ వీడియోలో శ్రీముఖి వంటలక్కగా, ముక్కు అవినాష్ డాక్టర్ బాబులా నటించేందుకు ప్రయత్నించారు. ‘కార్తీక దీపం’లోని ఓ సీన్‌లో డైలాగులను చెబుతూ.. ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్.. శ్రీముఖి చెంప వాయించాడు. ఆమె తల్లి, తమ్ముడి ముందే.. ఆమెను కొట్టాడు. అయితే, సీరియస్‌గా కాదండోయ్.. సరదాగానే. అవినాష్, శ్రీముఖి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎక్కడ కలిసినా.. అక్కడ సందడి కనిపిస్తుంటుంది. అప్పుడుప్పుడు వాళ్ల చేష్టలతో నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. 


వీడియో:


అవినాష్ కంటే ముందే శ్రీముఖి ‘బిగ్‌బాస్-3’ హౌస్‌లోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె స్నేహితుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నర్‌అప్‌ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి సీజన్‌లో అవినాష్ కూడా తన లక్ పరీక్షించుకున్నాడు. చివరి వరకు నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో హౌస్‌ను వదలక తప్పలేదు. అయితే, బిగ్‌బాస్‌ వల్ల ఆమెకు అరియానాతో స్నేహం కుదిరింది. ‘బిగ్‌బాస్’లో అవకాశం వల్ల అవినాష్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని వదిలిపెట్టాడు. శ్రీముఖి కూడా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘పటాస్’ కార్యక్రమానికి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ ఇద్దరు ‘కామెడీ స్టార్స్’లో సందడి చేస్తున్నారు. 


Also Read: బస్సు ఫుట్‌బోర్డుపై.. నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రయాణం, వీడియో వైరల్


Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!


Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?


Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌