బుల్లితెరపై ఓ వెలుగు వెలిగింది యాంకర్ అనసూయ. ‘జబర్దస్త్’ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోయింది. తాజాగా అనసూయ.. బుల్లితెర కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో సుడిగాలి సుధీర్ అభిమానులు అనసూయపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరు అయింది. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. సుడిగాలి సుధీర్ తో కలసి ‘వాంటెడ్ పండుగాడు’ సినిమాలో నటించారు కదా, సుధీర్ తో పనిచేయడం ఎలా అనిపించింది? అని అడిగితే.. ‘‘సుధీర్ నాకంటే జూనియర్. నేను సీనియర్ ఆ విషయం మర్చిపోయారా మీరు? నాతో చేయడం ఎలా ఉంది అని సుధీర్‌ను అడగండి, నన్ను కాదు’’ అని బదులిచ్చింది. ఆ తర్వాత మళ్లీ సుధీర్ తన నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పాడని, తాను కూడా సుధీర్ నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పింది. అనసూయ చేసిన వ్యాఖ్యలు సుధీర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా చేశాయి. ఇక సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. రెండు సినిమాలు చేసేసరికి ఇలా మాట్లాడుతావా? అంటూ అనసూయపై రెచ్చిపోతున్నారు. సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ లో సగం ఫాలోయింగ్ కూడా అనసూయకు ఉండదు అని విమర్శిస్తున్నారు సుధీర్ ప్యాన్స్.
అనసూయ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఇంతకముందు సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ‘ఆంటీ’ అని పిలిస్తే పెద్ద రచ్చే చేసింది. ‘‘నన్ను ఆంటీ అని పిలుస్తావా.. ఇంకో సారి ఎవరైనా ఆంటీ అంటే కేస్ పెడతాను’’ అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ మేటర్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ ఆంటీ మేటర్ ను ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ ట్రోలింగ్ పై అనసూయ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో వేచి చూడాలి.
ఇక సుడిగాలి సుధీర్ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. ఇటు టీవీ ప్రోగ్రామ్‌లు, అటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడు’ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు సుధీర్. అయితే ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సుధీర్ రీసెంట్‌గా నటించిన ‘గాలోడు’ సినిమా ఊహించిన దానికంటే మంచి ఫలితాన్నెే ఇచ్చింది. సుధీర్ ను హీరోగా నిలబెట్టేందుకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ఈ మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినా తర్వాత కలెక్షన్లు మాత్రం భారీ గానే వచ్చాయి. దీంతో ఈ మూవీ ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకుంది. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.5 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో సుధీర్ కు హీరోగా వరుస అవకాశాలు వస్తున్నాయి.
Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?