Anasuya: యాంకర్ అనసూయ లాంగ్ హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. మొన్నటి వరకూ తన భర్తతో కలసి హాలిడే టూర్ లో గడిపింది అను. అక్కడ భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలు, ఆమె బికినీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆమె షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు, ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల అనసూయ తన మీద వస్తోన్న ట్రోలింగ్స్ పై స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఖాతాలో ఓ పెద్ద నోట్ ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 


నన్ను అగౌరవపరుస్తున్నారు: అనసూయ


ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ట్రోలింగ్ పై అనసూయ స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పెద్ద పోస్ట్ చేసింది. ఎవరో కొంతమంది సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురిని తక్కువ చేసి మాట్లాడానికి తన పేరును వాడుతున్నారని అంది అనసూయ. దానికి సంబంధించిన కొన్ని పోస్ట్ లను తాను గత కొన్ని రోజులుగా చూస్తున్నానని అంది. తన పేరును తక్కువ చేసి మాట్లాడం అంటే తనను కూడా అగౌరవపరిచినట్లేనని అభిప్రాయపడింది. వాటికి తనకు ఏ సంబంధం లేదని, తన జీవితాన్ని తనకు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా జీవించాల‌ని కోరుకుంటున్నానని చెప్పింది. 


నాకు ప్యామిలీ ఉంది, నన్ను వదిలేయండి ప్లీజ్..


తాను ఎవ్వరి జోలికి వెళ్లడం లేదని.. ఎందుకంటే దాని వల్ల చివరికి తానే బాధపడుతున్నానని చెప్పింది అనసూయ. తాను స్వ‌శ‌క్తితో ఎదిగిన మ‌హిళ‌లనని, ప్రోత్స‌హించ‌క‌పోయినా, ప్ర‌శంసించ‌లేక‌పోయినా ఫ‌ర్వాలేదు గానీ, క‌నీసం త‌న‌కు జోలికి మాత్రం రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. తన గురించి పబ్లిసిటీ చేయడానికి తన వద్ద ఎలాంటి పి ఆర్ టీమ్ లేదని, సరైన మార్గంలోనే తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పింది. తనకు ఓ కుటుంబం ఉందని, తనను ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని ఆ ట్వీట్ల నోట్ లో రాసుకొచ్చింది అనసూయ. 


ఆ గొడవ సద్దుమనిగింది అనుకునేలోపే..


కొన్నాళ్ల క్రితం నుంచి అనసూయకు హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య చాలా వివాదమే నడించింది. అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల వార్ జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా డైలాగ్స్ విషయంలో విజయ్ తో విభేదాలు వచ్చాయని, ఆ తర్వాత నుంచి తనపై ఇంటర్నెట్ లో ట్రోల్స్ మొదలైయ్యాయని చెప్పింది. దానికి కారణం విజయ్ నే అని తర్వాత తెలసి బాధపడ్డానని అంది. ఏదేమైనా ఈ వివాదం ఇక్కడితో ఆపేస్తున్నానంటూ చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే ఆ గొడవ సద్దుమనిగింది అనుకునేలోపు అనసూయ ఫోటోలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో మళ్లీ అనసూయ తనను వదిలేయండి అంటూ మళ్లీ చెప్పుకొచ్చింది. మరి ఇక్కడితో అనసూయ పై ట్రోల్స్ తగ్గుతాయో లేదో చూడాలి.