Anasuya Bharadwaj Social Media Post: యాంకర్ గా బుల్లితెరపై ఓ రేంజిలో సందడి చేసిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అన్ని సినిమాలోనూ మాంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా నటించి ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఓవైపు గ్లామర్ షో చేస్తూనే, మరోవైపు నటనలో నవరసాలను ఒలికిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2‘ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన అందాల కనువిందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
అనసూయ కీలక నిర్ణయం
కాసేపు అనసూయ సినిమాల విషయాన్ని పక్కన పెడితే, తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అనేది తెలియక పోయినా, ఆమెను బాగా హర్ట్ చేసినట్లు మాత్రం అర్థం అవుతోంది. తన మర్యాదకు భంగం కలిగించిన వాళ్లను దూరం పెట్టడమే మంచిదని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి వాదనలకు, డ్రామాలకు తావులేదని చెప్పుకొచ్చింది. ఎవరేం మాట్లాడినా పట్టించుకోనని తేల్చి చెప్పింది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇకపై నేను స్పందించను. ఎవరితో వాదనకు దిగను. నటించను. సింపుల్‌గా కలవడం మానేస్తా’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న నెగిటివిటికి సంబంధించి ఆమె ఇలా రాసి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
ప్రస్తుతం అనసూయ సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతోంది. ఆమె చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆమె నటించి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’,’ విమానం’, ‘పెదకాపు 1’,’ ప్రేమ విమానం’ లాంటి చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ‘పుష్ప-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లోగా మరికొన్ని సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. అటు నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా, తన అందం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది. మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయ దుస్తుల్లోనూ అందాలు ఆదరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోల కుర్రకారును తెగ అలరిస్తున్నాయి.
Read Also: ‘నెట్‌ఫ్లిక్స్’ నిర్ణయం కలచివేసింది, రెండుసార్లు గుండెపోటు వచ్చింది: అనురాగ్ కశ్యప్