బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటిన అనసూయ ప్రస్తుతం చేతి నిండి సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అరడజన్ కు పైగా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు సౌత్ సినిమాలన్నింటిలోనూ అడుగు పెడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యింది.  ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. నెటిజన్లు అడిగి ప్రశ్నకు ఆమె ఏం చెప్పిందో చూడండి. 


మీరు ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు?


ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. రంగమార్తాండ(తెలుగు), హరిహర వీరమల్లు(తెలుగు), చేజ్(తమిళ్, తెలుగు), ఫ్లాష్ బ్యాక్(తెలుగు, తమిళ్), పేరు పెట్టని తమిళ సినిమా, మిచెల్(పాన్ ఇండియన్), సింబా(తెలుగు), అరి(బహుభాషా)లో నటిస్తున్నాను. మరో తెలుగు సినిమా చేస్తున్నా, వివరాలు బయటకు చెప్పలేను. త్వరలో ‘పుష్ప-2‘ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నా. ఈ నెలలో మరో రెండు సినిమాలు మొదలుకాబోతున్నాయి. మలయాళం సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. 


ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుందా?


నాకు కావాల్సినంత టైమ్ ఉండదు. ఎందుకంటే, నేను ఫ్రీగా ఉన్న సమయంలో వారు(ఫ్యామిలీ మెంబర్స్) బిజీగా ఉంటున్నారు. వారు ఫ్రీగా ఉన్న సమయంలో నేను బిజీగా ఉంటున్నాను. కానీ, వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వారి కోసం ఎదురు చూసేలా టైమ్ సెట్ చేసుకుంటున్నాను.


ఇన్నీ సినిమాలు చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు?


చాలామంది నేను కోట్లు సంపాదిస్తున్నట్లు అనుకుంటారు. అందరి గురించి నాకు తెలియదు. కానీ, నేను మాత్రం అన్ని సినిమాలు డబ్బు కోసమే చేయను. గుడ్ వీల్ కోసం కూడా చేస్తాను. ఫలానా యాక్టర్ ఫ్యాన్ గానో, క్యారెక్టర్ నచ్చి బడ్జెట్ తక్కువ ఉన్నా చేస్తాను. అన్నింటి కంటే ఇంపార్టెంట్, నేను ఏదైనా వర్క్ ఒప్పుకుంటే నాతో పాటు చాలా మందికి ఇన్ కమ్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం.. నా అభిమాన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం. అన్నీ డబ్బుతోనే ముడిపెట్టి చూడలేం.


మీరు పెట్టిన పోలీస్ కేస్ ఏమైంది?


అరెస్టులు మొదలయ్యాయి కదండీ! ఇది కొందరి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం. అందుకే ఇన్వెస్టిగేషన్ బాగా చేసి అరెస్టు చేస్తున్నారు. కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా, ప్రొగ్రెస్ మాత్రం ఉంది. సైబర్ క్రైమ్ పోలీసుల పని తీరు పట్ల సంతోషంగా ఉంది. నా ఉద్దేశం ఒకటే.. ట్రోలింగ్ అంటే కించపరచడం కాదు. అగౌరవ పరచడం తప్పు. అది చట్టరీత్యా నేరం అనేది గట్టిగా చూపించాలి అనుకుంటున్నా. చాలా ఓపికతో నచ్చ చెప్పాలని చూశాను ఇన్నేళ్లు. ఇప్పుడు యాక్షన్ మొదలయ్యింది.


మీరు ఏ బెటాలియన్ నుంచి NCC చేశారు?


1(A) గర్ల్స్ బెటాలియన్ నుంచి చేశాను. RDC అయ్యింది. జూనియర్, సీనియర్ వింగ్ లో పని చేశాను. రెండింటిలోనూ పరేడ్ కమాండర్ గా చేశాను. రెండుసార్లు ట్రోఫీ గెల్చుకున్నాను. NCC అచీవ్ మెంట్స్ పట్ల గర్వంగా ఫీలవుతున్నాను.


Read Also: సంక్రాంతి బరిలో అజిత్‌ ‘తునివు’ - తెలుగులోనూ రిలీజ్, ఈసారైనా ఆ కష్టాలు తీరేనా?