War 2 War MLA Daggubati Vs NTR Fans: మా అభిమాన హీరో ఎన్టీఆర్ ని.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బూతులు తిట్టారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు మా హీరోకి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. మా హీరో 15 ఏళ్ల క్రితమే మాటిచ్చారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా అండగానే ఉంటానని చెప్పారు. అదే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు, మేం కూడా కట్టుబడి ఉన్నాం. మేం ఓటు వేయకుండా టీడీపీ ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలిచారా? మా అభిమాన హీరో తారక్ మాటమేరకే మేమంతా కూడా టీడీపీతోనే కలసినడుస్తున్నాం. అనవసరంగా మా హీరో గురించి మాట్లాడారు. ఆడియో బయటకు వచ్చిన తర్వాత తాను ఏమీ అనలేదని చెప్పడం , అభిమానులకు క్షణాపణలు చెప్పడం కాదు.. అసలు నాగులు గోడల మధ్య కాదు..బహిరంగంగా క్షణాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తారక్ అభిమానులు.
జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఏముందంటే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఫైర్ అయ్యారు. మంత్రి నారా లోకేష్ కి వ్యతిరేకంగా ఉన్న తారక్ సినిమాలు ఆడనిచ్చేది లేదన్నారు. మరోవైపు మాట్లాడుతున్న వ్యక్తి దానికి దీనికి సంబంధం ఏంటన్నా అని చెబుతున్నా వార్ 2 ఆడదు, ఆడదు, ఆడదు...తాను ఇక్కడ MLAని అని, సినిమాను నిలిపేయాలని వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎలా మాట్లాడుతారని ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగారు, బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో ఆ ఆడియోపై స్పందించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. రాజకీయ కుట్రలో భాగంగా ఆడియో బయటకు వచ్చిందని, తన సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. అది ఫేక్ ఆడియో అని కుట్రలో భాగంగా ఇలా చేశారని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా SPకి కంప్లైంట్ చేశానని కచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారని అన్నారు వెంకటేశ్వర ప్రసాద్. ఈ ఆడియో కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనసు నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నా అంటూ వీడియో రిలీజ్ చేశారు. నారా నందమూరి కుటుంబాలకు తానెప్పటికీ విధేయుడినే అన్నారాయన.
రాయలసీమ ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు తారక్ అభిమానులు. దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయంలో లేరని సిబ్బంది చెప్పడంతో అక్కడే బైఠాయించారు