Ammayi garu Serial Today Episode: తనకు  తెలియకుండా ఈ ప్లాన్‌లో తనను ఇరికించడంపై కోమలి విజయాంభికాను  నిలదీస్తుంది. ఇంకోసారి ఇలాంటి ప్లాన్‌లు వేస్తే ముందుగా తనకు చెప్పాలని అంటుంది. మన పథకాలను రాజు, రూపలు ఎలా తిప్పికొడతారో అంచనా వేయలేకపోతున్నాం అంటుంది. రాజు,  రూపను తేలిగ్గా  తీసుకోకూడదని కోమలి హెచ్చరిస్తుంది.

Continues below advertisement

 కోమలి ప్రెగ్నెంట్ డ్రామాను బయటపెడితే...సూర్య తనని బయటకు గెంటేస్తాడని మనం ప్లాన్ చేస్తే...మళ్లీ తప్పించుకుందని రూపతో  తల్లి విరూపాక్ష అంటుంది. మనం వేసే ప్లాన్లు అన్నీ వాళ్లకు  అనుకూలంగా మారుతున్నాయని బాధపడుతుంది. కోమలిని ఇంటి నుంచి ఎలా బయటకు పంపాలో అర్థం కావడం లేదని కుమిలిపోతుంది. దీనికి రూప తన తల్లిని సముదాయిస్తుంది. మన ప్లాన్లు అన్నీ ఫెయిల్‌ అవుతున్నా...నాన్న నీకు ఎంతో కొంత దగ్గరవుతున్నారన్న  సంతోషం ఉందని చెబుతుంది. దీనికి రాజు కూడా  వంతపాడతాడు. కోమలి మెట్లపై నుంచి పడిపోయి ప్రెగ్నెన్సి పోవడానికి మీరే కారణమని విజయాంబిక కుట్ర చేసినా  పెద్ద అయ్యగారు  నమ్మలేదని చెబుతాడు. విరూపాక్ష అలాంటిది కాదని సమర్థించారని గుర్తు చేస్తాడు.

  ప్రెగ్నెన్సీ డ్రామాతో ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్‌చేస్తే ఇలా జరిగిందేమిటా అని విజయాంబికా, కోమలి మాట్లాడుకుంటుండగా...రాజు,రూప అక్కడికి వస్తారు. నేను చెప్పినట్లే 24 గంటల్లో  మీ ప్రెగ్నెన్సీ డ్రామాకు ఫుల్‌స్టా‌ప్ పెట్టేశామని  రాజు వారితో అంటాడు. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని....విజయాంబిక వాళ్ల మాటలు వినొద్దని రూప కోమలిని హెచ్చరిస్తుంది. త్వరలోనే  నీ నాటకానికి  కూడా తెరదింపుతామని చెప్పి వారు అక్కడ నుంచి వెళ్లిపోతారు. అంతకు ముందు కోమలి తాను అనాథనని విజయాంబికాతో చెప్పడం విన్న రూప....రాజును సిటీలో ఉన్న అన్ని అనాథ శరణాయలకు వెళ్లి ఎంక్వయిరీ చేయమని పురమాయిస్తుంది. అప్పుడు  కోమలి బండారం  బయటపెట్టొచ్చని చెబుతుంది. దీంతో రాజు అనాథ శరణాలయాల లిస్టు తీసుకుని బయలుదేరతాడు. మరోవైపు రూప కూడా  వివిధ శరణాలయాలకు వెళ్లి కోమలి గురించి  ఆరా తీసినా  ఎక్కడా వారికి కావాల్సిన వివరాలు లభించలేదు.  ఆనంద్ గురించి తెలిసినా...కోమలి వివరాలు పట్టుకోవచ్చని రాజు రూపకు చెబుతాడు.

Continues below advertisement

  విరూపాక్ష  చెప్పిన మాటలు నమ్మి బ్యాంకులో వాయిదాలు కట్టిన  ఆటోడ్రైవర్లు..తమకు  కొత్త ఆటోలు కావాలంటూ  బ్యాంకుకు వెళ్లగా....మేనేజర్‌ వారిని అవమానించి బయటకు గెంటేస్తాడు. దీంతో వారు ఎమ్మెల్యే విరూపాక్షకు ఫోన్ చేయడంతో ఆమె అక్కడికి వస్తుంది.గన్‌ తీసుకుని వచ్చి మేనేజర్‌ను బెదిరిస్తుంది. వాళ్లు కట్టిన సొమ్ము వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తుంది.

   అన్ని అనాథ ఆశ్రమాలు వెతుక్కుంటూ  చివరికి వాళ్ల తల్లి స్థాపించిన అమ్మ అనాథ ఆశ్రమానికి వస్తారు రూప,రాజు.  కోమలి ఖచ్చితంగా  ఈ అనాథ ఆశ్రమంలో ఉండే అవకాశం లేదని...ఒకవేళ ఉంటే  తన తల్లి విరూపాక్షకు తెలిసిపోతుందని రూప రాజుతో అంటుంది. అయినా సరే  ఒకసారి కనుక్కుని వెళ్తామని అతను అంటాడు. అలా లోపలికి వెళ్తారు ఇద్దరు.అక్కడే గోడమీద కోమలి ఫోటో ఉంటుంది. వీళ్లిద్దరిని అక్కడ  చూసిన  ఓ అమ్మాయి...ఈవిషయాన్ని ఫోన్‌లో కోమలికి చేరవేయడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.