Ammayi garu Serial Today Episode : మౌనికను మందారం చెంపమీద లాగిపెట్టి కొడుతుంది. తన భర్తను పెళ్లి చేసుకోవడమేగాక...నన్నే తిడతావా అంటూ ఒక్కటిస్తుంది. మా ఇంటికి వెళ్తాం పదండని తన భర్తను,అత్తను మందారం పిలుస్తుంది. మీ నాన్న నన్ను కొడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావని అందుకే మీ ఇంటికి రానని దీపక్‌ తెగేసి చెబుతాడు.ఇక నుంచి నువ్వు నా భార్యే కాదని..మౌనికనే నాకు భార్య అంటాడు.

 

దీపక్‌: పద మౌనిక మనం మీ ఇంటికి వెళ్దాం

 

మౌనిక: ఎవరు భార్య ఎవరికి భార్య....నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఇళ్లరికం తీసుకెళ్లి ఏలుకోవడానికి కాదు.. నీ వెనక ఉన్న మీ మామయ్య సీఎం పదవి చూసి, నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నాను.ఏదో విధంగా లైఫ్‌లో సెటిలైపోదామని నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీ వెనక మీ మామయ్య సీఎం లేడు.ఆస్తి లేదు. ఎలాగూ విడాకులు కోసం అప్లయి చేసేం కదా..అప్పుడు కలుద్దాం గుడ్‌బై

 

దీపక్‌: మౌనిక..అలా అనకు మౌనిక ఆ విడాకులు నీకు,నాకు ప్లాన్ చేసింది కాదు.  నేను ఈ మందారం మెడలో ఇష్టంగా తాళి కట్టలేదు.కానీ నీమెడలో చాలా ఇష్టంగా  తాళి కట్టాను

 

మౌనిక: ఓహో..నేను మాత్రం నీమీద ఇష్టంతో తాళి కట్టించుకోలేదు. కావాలంటే నీ తాళి నువ్వే ఉంచుకో అంటూముఖంపై తాళి విసిరివేస్తుంది

 

మందారం: ఇప్పటికీ మించిపోయింది లేదు...మనం మన ఇంటికి వెళ్లిపోదం పదండి.మీరు నన్ను ఇష్టంగా పెళ్లిచేసుకోకపోయినా...నేను మాత్రం మిమ్మల్ని ఇష్టంగానే పెళ్లిచేసుకున్నాను. మీరు ఎన్ని దారుణాలు చేసినా...మిమ్మల్ని మార్చుకుందామనే అనుకున్నాను.

 

దీపక్‌: నా ప్రాణం పోయినా మీఇంట్లో అడుగు పెట్టను

 

మందారం: సరే మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఇంకో విషయం దీపక్‌ ఇప్పుడు నువ్వు బెయిల్‌పై బయటకు వచ్చావ్‌...నేనుగానీ,మా నాన్నగానీ తలచుకుంటే నువ్వు మళ్లీ జైలుపాలవ్వడం ఖాయం. అప్పుడు మీ అమ్మకు గంజినీళ్లు పోసే గతికూడా ఉండదు.

అప్పుడే అక్కడికి రూప, రాజు వస్తారు. మేం ఎంతచెప్పినా వినకుండా ఆ మౌనిక మెడలోతాళి కట్టావు..ఇప్పుడు అదే నీముఖంపై తాళి విసిరేసిపోయిందని అంటారు. నువ్వు కాదనుకున్నామందారం మీతోనే ఉండాలనకుంటుంది. ఇంతకన్నామంచి భార్య నీకు దొరకదని అంటుంది. అప్పుడు మందారం కలుగజేసుకుని ఆ మౌనిక వెళ్లిపోయిందని...ఇక మేం హాయిగా ఎక్కడైనా బతుకుతామని చెప్పగా....నాన్నగారు మిమ్మల్నిఇంటికి తీసుకురమ్మని చెప్పారని రూప చెబుతుంది. మెడపట్టి బయటకు గెంటేసి ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తామని దీపక్ అనగా...ఇప్పుడు మీరు ఇంటికి రాకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని రాజు బెదిరిస్తాడు. 

 

                   అంతకు ముందే రూప దీపక్‌ను మళ్లీ ఇంట్లో ఉండేలా వాళ్ల నాన్న ఒప్పిస్తుంది. ఇంట్లో ఉండే ఇన్ని దారుణాలకు తెగబడిన వాళ్లు బయటకు వెళ్లి మరెన్నిదారుణాలకు పాల్పడుతారోనని ఒప్పిస్తుంది. దీంతో మందారం వాళ్ల భర్తను, అత్తను తీసుకుని ఇంటికి వెళ్తుంది.

ఇంట్లోకి వచ్చిన తర్వాత చంద్ర,సుమతోపాటు సీఎం కూడా దీపక్‌ను వాళ్ల అమ్మను పట్టించుకోకపోవడంతో వాళ్లు కోపంతో  రగిలిపోతూ మళ్లీ కుట్రలు పన్నుతుంటారు. స్కూల్ శంకస్థాపనకు విరూపక్షతోపాటు సీఎం హాజరుకానుండటంతో అక్కడే వారిని దెబ్బకొట్టాలని దీపక్ పథకం వేస్తుంటాడు. ఈ మాటలన్నీ విన్నమందారం....ఇక మీరు మారరాఅంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఆమె గొంతు నులిమి చంపేందుకు దీపక్ ప్రయత్నిస్తాడు. ఆమె కళ్లల్లోకి సూటిగా చూసి ఒక్కసారిగా దీపక్ భయపడిపోతాడు. నన్ను చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమయ్యారని మీరు నన్నేం చేయలేరని మందారంఅంటుంది. దీంతో మందారాన్నికొట్టేందుకు దీపక్ చేయి పైకి ఎత్తగానే...మందారం ఆ చేతిని పట్టుకుంటుంది. కోపంతో రగిలిపోయిన దీపక్‌ తల్లి వచ్చి మందారం చెంపమీద కొట్టడంతో...మందారం కూడా తిరిగి అత్తగారి చెంప పగులగొట్టడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది..