Amala Paul Comments On TFI : టాలీవుడ్‌పై అమలా పాల్ కామెంట్స్ - హీరోలుగా వచ్చిన వారసులపై ఇన్ డైరెక్ట్ ఎటాక్?

రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన అమలా పాల్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్ చేస్తున్నారు. హీరోలుగా వచ్చిన వారసులు, స్టార్స్‌పై ఇన్ డైరెక్ట్ ఎటాక్ చేశారు.

Continues below advertisement

తెలుగు ప్రేక్షకులకు అమలా పాల్ (Amala Paul) సుపరిచితురాలు. ఇప్పుడు ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. అయితే... తమిళంలో ఆమె నటించిన ప్రతి సినిమా తెలుగులో అనువాదం అవుతోంది. ఆఖరికి అమలా పాల్ ప్రొడ్యూస్ చేసిన, ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ మూవీ 'కడవర్'ను కూడా తెలుగులో డబ్ చేశారు. తెలుగు మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటున్న అమలా పాల్, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్ చేశారు.

Continues below advertisement

ఫ్యామిలీలు, ఫ్యాన్స్ డామినేట్ చేస్తున్నాయ్! - అమలా పాల్
''నేను తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Film Industry - Tollywood) కు వెళ్ళినప్పుడు... అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉందని అర్థం చేసుకున్నాను. అక్కడ కొన్ని ఫ్యామిలీలు, వాళ్ళ ఫ్యాన్స్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు. నేను తెలుగులో సినిమాలు చేసినప్పుడు... వాళ్ళు తీసే సినిమాలు వేరుగా ఉండేవి'' అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అమలా పాల్ పేర్కొన్నారు. తెలుగులో అమలా పాల్ చేసిన స్ట్రెయిట్ సినిమాలు ఎన్ని? లెక్క పెడితే ఐదు కంటే ఎక్కువ ఉండవు.

అక్కినేని నాగ చైతన్యకు జోడీగా 'బెజవాడ' చేశారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'నాయక్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'ఇద్దరమ్మాయిలతో', నాని 'జెండాపై కపిరాజు' మెయిన్ తెలుగు మూవీస్ అనుకోవాలి. సిద్ధార్థ్ 'లవ్ ఫెయిల్యూర్' తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన బైలింగ్వల్ సినిమా. చరణ్, అర్జున్, చైతన్య... ఈ ముగ్గురూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులుగా వచ్చినవాళ్ళే. ఇప్పుడు అమలా పాల్ ఫ్యామిలీలు, ఫ్యాన్స్ అంటే ఎవరిని కామెంట్ చేసినట్లు?

కెరీర్ స్టార్టింగ్‌లో స్టార్ హీరోల సరసన నటించి... పేరు వచ్చిన తర్వాత డిఫరెంట్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసి... ఇప్పుడు తెలుగుపై కామెంట్స్ చేస్తున్నారని, 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో యాక్షన్ సీన్స్‌లో ఆవిడకు ఇంపార్టెన్స్ ఇచ్చిన సంగతి మార్చుపోయారేమో? అని టాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు.

తెలుగులో ప్రతిదీ గ్లామరేనా?
''నేను నటించిన తెలుగు సినిమాల్లో ప్రతి దాంట్లో ఇద్దరు హీరోయిన్లు ఉండేవారు. అవి చాలా కమర్షియల్ సినిమాలు. పాటలు, ప్రేమ సన్నివేశాలకు మాత్రమే హీరోయిన్లను తీసుకోవడం జరిగేది. ఆ సమయంలో నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ కనెక్ట్ కాలేకపోయాను. కొన్ని సినిమాలు మాత్రమే చేశాను'' అని అమలా పాల్ పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైన 'పిట్ట కథలు' యాంథాలజీ ఫిల్మ్‌లో అమలా పాల్ నటించారు. 

Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!

కథానాయికగా చిత్రసీమలో అమలా పాల్‌ది పదేళ్ల ప్రయాణం! ఇప్పుడు ఆవిడ కమర్షియల్ సినిమాలలో కాకుండా వైవిధ్యభరిత సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆవిడ సినిమా జీవితం కంటే వ్యక్తిగత జీవితం ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులు, ఆ తర్వాత లవ్ ఎఫైర్స్, పెళ్లి అంటూ కొందరు చేసిన కామెంట్స్ డిస్కషన్ పాయింట్ అవుతోంది.

Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి

Continues below advertisement