Allu Arjun Trivikram Srinivas Latest Movie Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ & మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్... వీళ్ళిద్దరిదీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! 'జులాయి' సినిమాతో ఈ కాంబినేషన్ మొదలైంది. తర్వాత 'సన్నాఫ్  సత్యమూర్తి' చేశారు. అదీ హిట్టు! ఆ తర్వాత 'అల వైకుంఠపురములో' చేశారు. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది.   


డబుల్ హ్యాట్రిక్... పాన్ ఇండియా టార్గెట్!
హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్... డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టాలని ట్రై చేస్తున్నారు. 'అల వైకుంఠపురములో' విడుదలైన తర్వాత తామిద్దరం మరో సినిమా చేస్తామని తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే... పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. 


త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం 'గుంటూరు కారం' తెరకెక్కిస్తున్నారు ఆయన. అది సౌత్ లాంగ్వేజెస్, హిందీలోనూ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే... అది ప్రాపర్ పాన్ ఇండియా సినిమా కాదు. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేయబోయే సినిమాతో ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని యూనివర్శల్ కాన్సెప్ట్ ఉన్న స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట!


300 కోట్ల బడ్జెట్... హీరోయిన్ కన్ఫర్మ్ చేశారా?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ఫిలిం నగర్ ఖబర్. 'పుష్ప'తో బన్నీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయన సినిమా హిట్ అయితే 500 కోట్ల వసూళ్లు రావడం కష్టం ఏమీ కాదు. మినిమమ్ 300 కోట్లకు వచ్చేస్తాయి. అందుకని, నిర్మాతలు ఖర్చు విషయంలో వెనుకాడకూడదని నిర్ణయించుకున్నారట. 


Also Read : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?


'అల వైకుంఠపురములో' చిత్రాన్ని అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మళ్ళీ ఆ రెండూ కలిసి కొత్త సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. 


Also Read 'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రన్ టైం విషయంలో జాగ్రత్త పడిన నాని


ఈ సినిమాలో కథానాయికగా త్రిష పేరు వినబడుతోంది. దర్శకుడిగా త్రివిక్రమ్ రెండో సినిమా 'అతడు'లో మహేష్ బాబు సరసన త్రిష నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను తన సినిమాల్లోకి తీసుకోలేదు త్రివిక్రమ్. సుమారు 18 ఏళ్ళ తర్వాత వాళ్ళ కాంబినేషన్ రిపీట్ కానుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.



'2018' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన 'బన్నీ' వాసు... వచ్చే ఏడాది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ఉంటుందని చెప్పారు. ఆ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాయే. మహేష్ బాబు సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి పని చేస్తారా? లేదంటే మధ్యలో ఇద్దరూ చెరో సినిమా చేసి వస్తారా? అనేది చూడాలి.