- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అంటే... దుబాయ్‌లో అని చెప్పాలి. ఆయన అక్కడ దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
- సమంత స్విట్జర్లాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ స్కీయింగ్ చేసిన వీడియో పోస్ట్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా స్కీయింగ్ చేయడానికి ముందు ఫెయిల్ అయిన వీడియో పోస్ట్ చేశారు.
- రాశీ ఖన్నా ఇప్పుడు రష్యా రాజధాని మాస్కోలో ఉన్నారు. అక్కడ విపరీతంగా చలి ఉందని పేర్కొన్నారు.
- తమిళ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్'లో నటించిన మాళవికా మోహనన్ ఇప్పుడు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ సముద్రాన్ని చూస్తూ... బికినీలో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. గతంలో మాల్దీవులు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోను హీరోయిన్ దిశా పటానీ పోస్ట్ చేశారు.
- మాళవికా శర్మ అని మరొక హీరోయిన్ ఉన్నారు కదా! మాస్ మహారాజ్ రవితేజ 'నేల టికెట్', ఉస్తాద్ రామ్ పోతినేని 'రెడ్' సినిమాల్లో నటించారు. ఆవిడ ఇప్పుడు గోవాలో ఉన్నారు. పుట్టినరోజు వేడుకల కోసమని వెళ్లారు. మరో హీరోయిన్ నేహా శర్మ కూడా ఇప్పుడు గోవాలో ఉన్నారు. ఆమె వెంట చెల్లెలు ఐషా శర్మ కూడా ఉన్నారు. ఇద్దరూ బికినీల్లో సందడి చేస్తున్నారు.
- తెలుగమ్మాయి అనన్యా నాగళ్ళ విహయాత్రకు వెళ్లారో? లేదంటే సరదాగా ఫొటోషూట్ చేశారో? ఇదిగో ఆమె ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.