'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. బన్నీ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. 


రీసెంట్ గానే ఈ సినిమా సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ కి వెళ్లారు. అక్కడే రెండు వారాలకు పైగా సమయం గడిపి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముద్దుల కూతురు అల్లు అర్హ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. తన కూతురు చేసిన పనికి మురిసిపోయారు అల్లు అర్జున్. ఇక ఈరోజు ఆదివారం మొత్తం తన పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేశారు.


దీనికి సంబంధించిన వీడియోను బన్నీ భార్య అల్లు స్నేహ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఇందులో అల్లు అర్హతో కలిసి బొమ్మలు గీస్తూ కనిపించారు బన్నీ. క్రేయాన్స్, డ్రాయింగ్స్ అంటూ తన కూతురికి కంపెనీ ఇస్తున్నారు బన్నీ. పక్కనే అల్లు అయాన్ కూడా ఉన్నాడు. 


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బన్నీ 'పుష్ప' పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఫిబ్రవరిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మరింత ఎక్కువ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.