యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా విడుదలై మూడేళ్లు గడిచిపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. రాజమౌళితో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేశారు. జక్కన్నతో సినిమా చేయడంటేనే ఎన్నేళ్లు పడుతుందో అందరికీ తెలిసిందే.  2020లో 'ఆర్ఆర్ఆర్' వస్తుందని అనుకున్నారు. కానీ వాయిదా పడింది. 
 
2022 జనవరిలో సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని అన్నారు. కానీ ఆఖరి నిమిషంలో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయంలో ఆలస్యం జరుగుతుంది. ఈపాటికి కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతుంది. 


ఫైనల్ గా ఈ సినిమాను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 7న అఫీషియల్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తారని టాక్. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ ని కన్ఫర్మ్ చేశారని.. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయని అంటున్నారు.


అలానే హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ ను ఫైనల్ చేశారని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ సినిమా కథ.