Allu Arjun: సినిమా రంగంలో ఉండే సెలబ్రెటీలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా, ఏం చేసినా అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి. వాళ్లకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వాళ్ల సినిమాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లు వచ్చినా అవి వెంటనే వార్తల్లో ప్రత్యక్షమవుతాయి. దీని వల్ల సెలబ్రెటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటకు చెప్పరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ల ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొంతమంది సెలబ్రెటీలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో కూడా అలాంటి ఒక ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. 


సాధారణంగా సెలబ్రెటీలు కొంతమంది వారి వ్యక్తిగత ఉపయోగాల కోసం ఇలా నకిలీ ఇన్స్టా(ఫిన్స్టా) ను క్రియేట్ చేసుకుంటారు. అలా చాలా మంది సెలబ్రెటీలు చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అలాంటి ఫేక్ ఖాతాను ఓపెన్ చేశారట. ఈ ఖాతాకు సంబంధించిన బయోలో ‘ఫోస్ట్ థాట్లెస్లీ’ అని ఉంది. ఖాతాను అతని భార్య స్నేహా రెడ్డి, సమంతా రూత్ ప్రభు, లక్ష్మి మంచు, హన్సిక మోత్వాని మరికొంత మంది సెలబ్రెటీలు అనుసరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బన్నీ అభిమానులు అల్లు అర్జున్ ప్రయివేట్ అకౌంట్ కోసం సెర్చ్ చేయడం ప్రారంభించారట. మన తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి ఖాతాలను కలిగి ఉన్నారు. సుహానా ఖాన్, జాన్వీ కపూర్, షానాయ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తమ పబ్లిక్ ఖాతాలతో పాటు ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా కలిగి ఉన్నారు.


ఇక ఇటీవలే బన్నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నివాసం వద్ద వందలాది మంది అభిమానులు చేరుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బన్నీ కూడా బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో కూడా బన్నీకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కు శుభాకాంక్షలు చెబుతూ ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ కాసేపు చిట్ చాట్ చేశారు. వారిద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు సుకుమార్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అలాగే ‘పుష్ఫ 2’ నుంచి విడుదల చేసిన ‘పుష్ప రాజ్ ఎక్కడ’ అనే టీజర్ కూడా మూవీపై అంచానాలను మరింత పెంచేసింది. 


Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌ గా, సింగిల్ క్యారెక్టర్‌ తో సినిమా