Allu Arjun get relief from the High Court gets bail : సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై నమోదైన కేసు వ్యవహారంలో చివరికి ఆయన జైలుకు వెళ్లాల్నిన పరిస్థితి తప్పింది. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని ఏ -11గా ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించాలని అనుకున్నారు. దిగువ కోర్టు రిమాండ్ కు ఆదేశించింది.అయితే హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జైలుకెళ్లి పూచికత్తు ఇచ్చి ఇంటికెళ్లనున్న అర్జున్
వ్యక్తి గత పూచికతతో బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కు జైలుకెళ్లే గండం తప్పింది. జైలు సూపర్ డెంట్ కు షూరిటీ లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అరుణబ్ గోస్వామి తీర్పు ఆధారంగా ... అల్లు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు .. కొన్ని షరతులు విధించింది. పోలీసుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో జైలుకెళ్లి పూచికత్తు ఇచ్చి అల్లు అర్జున్ ఇంటికి వెళతారు.
నాలుగు వారాల మధ్యంతర బెయిల్ - మళ్లీ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్
అల్లు అర్జున్ కు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని లాయర్లు చెబుతున్నారు. ..నాలుగు వారాల మధ్యంతర బెయిల్ లభించింది. ఈ లోపు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు చేసినట్లుగా న్యాయమూర్తి తెలిపారు. జైలు సూపరింటెండెంట్‌కు అన్నీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని.. తీర్పు కాపీని చదివి అరెస్ట్ వరకు దారి తీసిన పరిణామాలను రికార్డ్ చేశారు న్యాయమూర్తి.
కొన్ని సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించబోవన్న కోర్టు
ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని తెలిపారు. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా అని ప్రశ్నించింది. చనిపోయిన రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని తెలిపింది.
సీనియర్ లాయర్లతో చేసిన ప్రయత్నాలు సఫలం
అరెస్టు అయిన తర్వాత వ్యూహాత్మంగా సీనియర్ లాయర్లను రంగంలోకి దింపిన అల్లు అర్జున్ హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. దాంతో హైకోర్టు అంగీకారం తెలిపింది. మొదట రెండు గంటలకు.. తర్వాత రెండు గంటలకు వాదనలు జరిగాయి. అక్కడ కూడా ప్రభుత్వం తరపు లాయర్.. బన్నీకి రిలీఫ్ ఇవ్వొద్దని గట్టిగా వాదించారు. తాము కౌంటర్ దాఖలుచేస్తామని చెప్పడం.. అప్పటికి దిగువ కోర్టు ద్వారా రిమాండ్ కు తరలిస్తారని స్పష్టత వచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు.