అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదల అయి మూడు నెలలు అవుతున్నా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సెలబ్రేట్ చేశారు.
ఈ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు టి.సుబ్బరామిరెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, బుచ్చిబాబు, క్రిష్ జాగర్లమూడి, మైత్రి మూవీస్ నిర్మాత వై.రవిశంకర్, సీఈవో చెర్రీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినిమా దర్శకుడు సుకుమార్ పర్సనల్ వెకేషన్‌లో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు.
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.