అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను వదిలారు. 


తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో చేసే సాహసమే ఈ సినిమా. ట్రైలర్ కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. 'డబ్బు.. సక్సెస్.. సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున విజయం అందుకున్నారు. అందులో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ... మంచి పేరు వచ్చింది. హిందీ ప్రేక్షకులు ఆయన పాత్ర గురించి మాట్లాడుతున్నారు. 'బ్రహ్మాస్త్ర' విజయం తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది ఘోస్ట్' సినిమాపై హిందీ ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది.



చిరుతో నాగ్ పోటీ:
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది. గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది. తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాను కలిసిన నాగార్జున.. చిరుతో క్లాష్ గురించి మాట్లాడారు. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారని.. ఇద్దరి సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దసరా సమయంలో ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల కావడం గత నలభై ఏళ్లుగా జరుగుతుందని.. సినిమా బాగుంటే పోటీకి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ సినిమాల సక్సెస్ ఈ ఇద్దరి హీరోలకు చాలా ముఖ్యం. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!