త కొంత కాలంగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో, అవకాశాల కోసం వెళ్తే ఎదురైన ‘కమిట్మెంట్’ల గురించి బయటకు చెప్తున్నారు. సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోల నుంచి ఆయా సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని పలువురు నటీమణులు వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా ఉంది. అన్ని సినిమా పరిశ్రమలకు చెందిన హీరోయిన్లు ఈ విషయం గురించి గొంతెత్తుతున్నారు.


లైగింక వేధింపుల గురించి వెల్లడించిన ఐశ్వర్య లక్ష్మీ


తాజాగా మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కాస్టింగ్ కౌచ్ గురించి కాకుండా, చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. చిన్న వయసులో తాను కేరళలోని గురువాయూర్ టెంపుల్ కు వెళ్లినట్లు చెప్పింది. ఆ సమయంలో ఓ యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులతో తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వివరించింది. ఆ సమయంలో తాను పసుపు రంగు దుస్తుల్లో ఉన్నానని, ఆఘటన తర్వాత తనకు పసుపు రంగు బట్టలు అంటేనే భయం వేసేదని వెల్లడించింది. ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు తన ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్య


తాజాగా ఐశ్వర్య లక్ష్మీ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. పలువురు కీలక నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం షూటింగ్ కొనసాగుతోంది. ఇందులోనూ ఐశ్వర్య లక్ష్మీ అదే పాత్రలో కనిపించనుంది. అటు మలయాళంలో  ‘క్రిస్టోఫర్’, ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే చిత్రాల్లో నటిస్తున్నది. అటు ‘మట్టి కుస్తీ’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తమిళంలో తెరకెక్కిన ‘ఘట్టా కుస్తీ’ అనే చిత్రాన్ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా కంటే ముందే తను తెలుగులో ‘గాడ్సే’ అనే  సినిమాలో నటించింది. సత్యదేవ్ తో కలిసి ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఐశ్వర్యకు కూడా పెద్దగా పేరు రాలేదు.


డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన ఐశ్వర్య 


వాస్తవానికి ఐశ్వర్య లక్ష్మీ ఎంబీబీఎస్ డాక్టర్. సినిమాల మీద ఉన్న ఆసక్తితో డాక్టర్ అయ్యాక యాక్టర్ కావాలి అనుకుంది. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల్లో పలు సినిమాలు చేసింది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.  


Read Also: ఇన్నాళ్లూ ఓపిక పట్టాను, ఇక యాక్షనే - అనసూయ వార్నింగ్