Kannappa Movie Updates : వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్ర హీరోలు నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఫోటోలను షేర్ చేశారు.
‘కన్నప్ప’ చిత్రంలో స్టార్ హీరోలు
మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మోహన్ బాబు. విష్ణు ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార శివపార్వతులుగా కనిపించనున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. వారిలో ఒకరు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కాగా, మరొకరు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్. “ఇద్దరు లెజెండరీ హీరోలు షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అద్భుతమైన సినిమాకు వారి శక్తి అదనపు బలంగా మారబోతోంది. ప్రసిద్ధ పురాణ కథ కోసం రెడీగా ఉండండి” అంటూ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు వారి ఫోటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకే షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్
ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారు మేకర్స్. ఇందుకోసం 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు ఆర్ట్ వర్క్ చేయించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. గాయాల నుంచి కోలుకోగానే సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కన్నప్ప’
ఇక ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!