26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సినిమా ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంగా ఉంది టీమ్. అయితే బిజినెస్ పరంగా ఈ సినిమా హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలో ఇప్పుడు చూద్దాం!
రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో జరిగిన బిజినెస్ డీటైల్స్..
నైజాం - రూ. 3.50 కోట్లు
సీడెడ్ - రూ. 2 కోట్లు
ఆంధ్ర - రూ. 4.50 కోట్లు
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. కోటి
ఓవర్ సీస్ - రూ. 2 కోట్లు
మొత్తంగా ఈ సినిమాను రూ.13 కోట్ల మేరకు అమ్మారు. దానికి మించి కలెక్షన్స్ రాబడితే సినిమా కమర్షియల్ వర్కవుట్ అవుతుంది. ఇక ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.