‘జబర్దస్త్’లో హైపర్ పంచ్‌లతో మంచి గుర్తింపు సంపాదించిన ఆదికి కూడా పెళ్లీడు వచ్చేసింది. అయితే, పెళ్లి ఊసు ఎత్తితే సుడిగాలి సుధీర్ తరహాలోనే దిక్కులు చూస్తున్నాడు ఆది. దీంతో సుధీర్ తరహాలోనే ఆది కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే, తాజాగా వర్షిణి పోస్ట్ చేసిన వీడియో చూసి.. అంతా ‘అమ్మ దొంగా, ఇదే కారణం’ అని అంటున్నారు. ఆ వీడియో చూస్తే ఎవరికీ ఆదిపై అనుమానం రాకపోయేది. ఆ వీడియోకు వర్షిణి ఇచ్చిన క్యాప్షన్ చూసే అంతా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆది, వర్షిణి కలిసి గతంలో ‘ఢీ ఛాంపియన్స్’ చేసిన సంగతి తెలిసిందే. ఆదికి జంటగా కనిపిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని రొమాంటిక్ సాంగ్స్‌కు కూడా ఇద్దరూ కలిసి డ్యా్న్స్ చేసేవారు. సుధీర్, రష్మీలకు ధీటుగా ఉండేందుకు వీరు చాలా క్లోజ్‌గా ఉండేవారు. దీంతో అప్పట్లోనే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ షో టీఆర్పీ కోసమే అలా ప్రచారం చేస్తున్నారు కాబోలని అనుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని ఇన్నాళ్లు భావించారు. ఇటీవల ఆది పుట్టిన రోజు సందర్భంగా వర్షిణి పోస్ట్ చేసిన వీడియోను చూసిన తర్వాత వీరి మధ్య ఏదో నడుస్తోందన్న అనుమానం నిజమేనని తేలిపోయింది.
‘‘ప్రియమైన ఆది.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నా జీవితంలో ఎప్పటికీ ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరకుంటున్నాను. నా అత్యంత ఇష్టమైన వ్యక్తి, నా 3am (తెల్లవారుజాము 3 గంటలు) స్నేహితుడు, నాకు సపోర్ట్‌గా ఉండే వ్యక్తివి నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది❤️” అని ఆ వీడియో క్యాప్షన్‌లో పేర్కొంది. అయితే, అందులో 3am స్నేహితుడని ఆమె చెప్పడం చూసి.. ‘‘ఏదో తేడా కొడుతుందే’’ అని ఓ ఫాలోవర్ కామెంట్ చేశాడు. మరొకరు.. ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని ప్రశ్నించాడు. మరి, వారి మధ్య ఉన్నది, స్నేహమో.. ప్రేమో తెలియదుగానీ.. ఈ వీడియో మాత్రం తెగ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
Also Read: బాలకృష్ణ మొదటి చిత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?