Sushmita Sen Own Pet Python: పెట్స్‌ అంటే ఇష్టం లేని వారుండరు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ముచ్చటగ పెంపుడు కుక్క లేదా పిల్లిని పెంచుకుంటారు. వాటితో సరదగా గడుపుతూ రిలాక్ష్‌ అవుతుంటారు. ఎక్కడికి వెళ్లిన వాటిని వెంట తెచ్చుకుంటూ ముద్దు చేస్తుంటారు. ఇది సాధారణ విషయమే. కానీ ముచ్చటపడి పామును పెంచుకోవడం గురించి విన్నారా? అదేంటి.. పామును పెంచుకోవడమా! షాక్‌ అవుతున్నారా? అవును.. ఓ బాలీవుడ్‌ బ్యూటీ ముచ్చటపడి పామును పెంచుకుంటుదట. ఆమె ఎవరో కాదు మాజీ విశ్వసుందరి, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సుష్మితా సేన్‌. ఆమెకు పాములంటే సరదా అట. ఆ మక్కువతోనే ఓ బుజ్జి పైథాన్‌ను (కొండచిలువను) పెంచుకుంటుందని టాక్‌.


ఖాళీ సమయంలో దానితో సరదాగా ఆడుకుంటుందట. ఈ విషయం గురించి ఆమె బయట ఎక్కడా ప్రస్తావించలేదు.. కానీ సుష్మితా కొండచిలువను పెంచుకుంటున్నట్టు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె సన్నిహిత వర్గాల నుంచే ఈ విషయం మీడియాకు లీకైందట. ఈ విషయం తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. అదేంటి సుష్మితా పాము పెంచుకోవడం ఏంటని అవాక్కవుతున్నారు. అయితే దీనిపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఈ వార్తలను సుష్మితా ఎప్పుడు ఖండించకపోవడం, స్పందించకపోవడంతో అంతా నిజమని నమ్మేస్తున్నారు. మరి ఇకనైనా ఈ వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. 


Also Read: రెండో రోజు పెరిగిన కలెక్షన్లు - 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?


వెబ్‌ సిరీస్‌తో బిజీగా


ఆ మధ్య ఐపీఎల్‌ స్రష్టికర్త లలిత్‌ మోడీతో డేటింగ్, బ్రేకప్‌ వార్తలతో సుష్మితా వార్తల్లో నిలిచింఇ. సుష్మితా, తాను డేటింగ్‌ ఉన్నామంటూ స్వయంగా లలిత్‌ మోడీయే చెప్పడం.. ఇద్దరు మాల్దివ్స్‌, ఇటలీ చక్కర్లు కొట్టిన ఫొటోలు షేర్‌ చేయడంతో అంతా షాక్‌. ఈ విషయం ప్రకటించిన కొద్ది రోజులుకే వారి బ్రేకప్‌ వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుష్మితా ఆర్య వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ తాజాగా మూడో సీజన్‌కు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో లేడీ గ్యాంబ్లర్‌గా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ‌