టుడు అలీ హోస్ట్ గా ‘ఈటీవీ’లో నిర్వహిస్తోన్న కార్యక్రమం ‘అలీతో సరదాగా’. ఇటీవల ఈ కార్యక్రమానికి సినీ రచయిత వక్కంతం వంశీ, ఆయన భార్య ‘ఆట’ శ్రీవిద్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. అయితే ఈ  కార్యక్రమంలో అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు శ్రీవిద్య సమాధానం చెప్తూ ఎమోషనల్ అయింది.


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రీ విద్య ఎందుకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది? ఎవరైనా బాధపెట్టారా? అని అలీ ప్రశ్నించగా.. శ్రీవిద్య దానికి సమాధానం చెబుతూ. ‘‘బాధ అనే దానికన్నా పెద్ద పదం ఉంటే.. అదే అవ్వాలి’’ అంటూ ఎమోషనల్ అయింది. ‘‘మాకు ఒక బాబు, పాప ఉన్నారు. పాప కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ప్రతీ ఏడాది ఆ రోజును తలుచుకొని బాధపడుతుంటాను’’ అని చెప్పింది. అయితే గతేడాది తనకు ప్రెగ్నెన్సీ వచ్చినా కొన్ని నెలలకే మొదటి బాబులానే ఆ బిడ్డ కూడా చనిపోయిందని కన్నీటిపర్యంతమైంది. తన కళ్ళ ముందే ఆ బిడ్డ పుట్టడం చనిపోవడం అంతా కేవలం నాలుగు నిమిషాల్లోనే జరిగిపోయిందని చెప్పింది. అలా జరగడంతో తాను షాక్ కు గురయ్యానని దాని నుంచి బయటకు రావడానికి దాదాపు రెండునెలలు సమయం పట్టిందని చెప్పింది.


తనకు కనీసం బాధ పడటానికి సమయం ఉందని, కానీ తన భర్తకు ఆ సమయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలకు అలీ కూడా కంట తడిపెట్టుకున్నారు. ఆట శ్రీవిద్య గతంలో చాలా హుషారుగా కనింపించేది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండేది. అయితే ఆ సంఘటన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ‘అలీతో సరదా’గా టాక్ షో లో చాలా సన్నగా కనిపించి షాక్ కు గురి చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య భర్త వక్కంతం వంశీ కూగా తన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. 


Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!


వక్కంతం వంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించారు. కానీ దర్శకుడిగా కాస్త తడబడ్డారు. త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి దర్శకులు కూడా రైటర్ నుంచి దర్శకుడిగా మాారిన వారే. అయితే వక్కంతం వంశీ మాత్రం కాస్త లేటుగానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత వంశీ కి మళ్లీ దర్శకుడిగా చాన్స్ రావడానికి చాలా టైమ్ పట్టింది. ప్రస్తుతం వంశీ నితిన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయట. ఈ సినిమాలో ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా వక్కంతం వంశీకి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.