క్వీన్ ఎలిజబెత్ వృద్ధాప్యం వల్లే మరణించిందని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, అధికారిక ప్రకటనలో కూడా అదే విషయాన్ని వెల్లడించారు. కానీ, ఆమె చివరి రోజుల్లో ఎంతో నరకాన్ని అనుభవిస్తూ చనిపోయారు. ఆమెను వేధించిన ఆ వ్యాధి మరేదో కాదు.. బోన్మారో క్యాన్సర్.


జీవిత చరిత్రలో ఆమె మరణానికి వృద్ధాప్యాన్ని కారణంగా చూపుతూ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నప్పటికీ క్వీన్ చివరి రోజుల్లో ఎంతో బాధను అనుభవించినట్టు చెబుతున్నారు. ఆ బాధకు కారణం మల్టీపుల్ మైలోమా అనే ఒక రకమైన బోన్మారో(ఎముకామజ్జ) క్యాన్సర్. బోన్మారో అంటే ఎముక మధ్యలో ఉండే గుజ్జు వంటి అవయవం. ఈ అవయవంలో క్యాన్సర్ మొదలవుతుంది. బోన్మారో రక్తంలో ఎర్ర, తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రక్త కణాలే తర్వాత కాలంలో ఇమ్యూన్ సిస్టం డెవలప్మెంట్‌కు అవసరమవుతాయి. మల్టీపుల్ మైలోమాలో ప్రాథమిక స్థాయిలో ఏ రకమైన లక్షణాలు కూడా కనిపించవు. క్వీన్ ఎలిజబెత్ విషయంలో సాధారణంగా చేసే బ్లడ్, యూరిన్ టెస్టుల్లో వచ్చిన తేడా వల్ల కనుగొన్నారు. ప్రాథమిక స్థాయిలో కనుగొనడం కష్టం కానీ తర్వాత స్టేజ్ లలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి.


⦿ ఎముకల్లో స్థిరంగా నొప్పి ఉంటుంది. ముఖ్యంగా వెన్ను, పక్కటెముకలు లేదా తుంటి ఎముకల్లో నొప్పి ఉంటుంది.


⦿ చాలా చిన్న కారణాలకే రక్త స్రావం జరుగుతుంటుంది. చర్మం మీద బ్రూయిసెస్ కూడా కనిపిస్తాయి.


⦿ అకారణంగా బరువు తగ్గడం, ఎముకలు బలహీనంగా మారడం ఈ వ్యాధి లక్షణాలు.


ఇవే కాదు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా కనిపిస్తాయి. తరచుగా రక్త హీనత బారిన పడతారు. రక్తహీనత వల్ల నీరసం, అలసట, కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. రక్తం చిక్కబడడం వల్ల దృష్టి లోపం, కళ్లు తిరగడం, స్పృహ కూడా కోల్పోతుంటారు.


హైపర్కాల్సేమియా అనే స్థితి కూడా తరచుగా ఏర్పడుతుంది. హైపోకల్సేమియా అంటే రక్తంలో కాల్షియం ఎక్కువ చేరుతుంది. దీని వల్ల విపరీతంగా దాహం, కడుపు నొప్పి, తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, ఆ సమయంలో నొప్పి ఉండడం, మలబద్దకం, అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అయితే మైలోమాలో సాధారణంగా కణితి ఏర్పడదు కనుక ఇతర క్యాన్సర్ల మాదిరిగా గుర్తించడం కొంచెం కష్టమే.


ఎవరికి రిస్క్?


మల్టిపుల్ మైలోమా పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తుంది. దీనికి పెద్దగా కారణాలు తెలియవు. అయితే మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్ నోన్ సిగ్నిఫికెన్స్ (ఎంజీయూఎస్) అనే ఓ ప్రత్యేక స్థితికి ఈ క్యాన్సర్ కు ఏదో తెలియని సంబంధం ఉందని భావిస్తున్నారు. ఎంజీయూఎస్ అంటే రక్తంలో సాధారణంగా ఉండే ఒక రకమైన ప్రొటీన్.. అధిక స్థాయిలో ఉంటుంది. సాధారణంగా ఈ స్థితి అంత ప్రమాదకరం కాదు. అయితే ఈ స్థితిలో ఉన్న 100 మందిలో ఒకరికి మల్లిపుల్ మైలోమా రావచ్చు.


చికిత్స


మల్టీపుల్ మైలోమాకు ప్రత్యేక చికిత్స ఏదీ అందుబాటులో లేదని చెప్పాలి. చాలా సార్లు  ఈ క్యాన్సర్ బారిన పడిన వారు కోలుకోరు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు, కొన్ని సంవత్సరాల పాటు వ్యాధిని అదుపులో పెట్టేందుకు మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా యాంటీ మైలోమా మందులు ఉంటాయి. వీటి ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంటారు. అనిమియా, నొప్పి వంటి వాటికి సింమ్టామాటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. బోన్మారో ట్రాన్స్ ప్లాంటేషన్ కొన్ని కేసుల్లో చక్కని పరిష్కారం. అయితే ఇది అందరిలో సాధ్యం కాదు.


Also Read: నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి