Sneha Was Not The First Choice For The Venky Movie 2004: మార్చి 24న విడుదలైన ‘వెంకీ’ సినిమా టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది. రవితేజ, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 20 ఏండ్లు పూర్తైనా ప్రేక్షకులను ఇప్పటికీ ప్రేక్షకులలో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలోని ట్రైన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. రైల్లో రవితేజ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, వేణుమాధవ్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. గజాలగా బ్రహ్మానందం, బొక్కా క్యారెక్టర్ లో ఏవీఎస్‌ పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. స్నేహను ఇంప్రెస్‌ చేసేందుకు రవితేజ ఆడే అబద్దాలు, గజాల, బొక్కాను టీజ్ చేసే విధానం ప్రేక్షకులను పడీ పడీ నవ్వేలా చేస్తుంది. రవితేజ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. కామెడీ మాత్రమే కాదు, అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు మరింత క్యూరియాసిటీ కలిగిస్తాయి.   


‘వెంకీ’ సినిమా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట!


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రావణిగా హీరోయిన్ స్నేహ నటించింది. చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమాకు స్నేహ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాలో హీరోయిన్ గా అసిన్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కానీ, ఆమె డేట్స్ అప్పట్లో ఖాళీగా లేకపోవడంతో ఈ పాత్రకు స్నేహను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.


వెంకీ సినిమా కథ ఏంటంటే?


ఇక ‘వెంకీ’ సినిమా కథ విషయానికి వస్తే.. నలుగురు యువకులు ఎలాంటి పనీ పాట లేకుండా తిరుగుతుంటారు. అనుకోకుండా ఈ నలుగురు పోలీసు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. శిక్షణ కోసం విశాఖ నుంచి హైదరబాద్ కు రైల్లో వస్తుంటారు. ఈ సమయంలోనే ఓ హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఈ నలుగురు మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడతారు. అసలు నేరస్థులు ఎవరు? అనేది ఈ సినిమాలో చూపిస్తారు దర్శకుడు శ్రీను వైట్ల.  


రవితేజ చిత్రంతో దర్శకుడిగా శ్రీనువైట్ల ఇండస్ట్రీకి పరిచయం


అటు రవితేజ, శ్రీను వైట్ల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి 4 సినిమాలు చేశారు. వీరిద్దరు కాంబోలో తొలిసారి ‘నీ కోసం’ అనే సినిమా చేశారు. ఈ సినిమాతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘దుబాయ్ శ్రీను’, ‘వెంకీ’తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. వీరిద్దరి కెరీర్ కు ‘వెంకీ‘ సినిమా ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమాతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.






Read Also: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?