సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మొదటి రెండు మూడు సినిమాలతోనే స్టార్డమ్ తెచ్చుకుంటారు. ఇంకొంత మంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే తర్వాత స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకొంత మందికి హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోగా మారే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో మూడో కోవలోకి వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకుని తర్వాత సరైన హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఉన్నాడు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. అదే ‘చిత్రం చూడర’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వరుణ్ సందేశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. 


తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ లో పోలీస్ స్టేషన్ లో వరణ్ సందేశ్ తో పాటు ధనరాజ్, కాశీ విశ్వనాథ్ కూర్చొని ఉన్నారు. వారి ఎదురుగా ఓ పోలీస్ లాఠీ పట్టుకుని నిలుచున్నట్టు కనిపిస్తున్నాడు. విచారణ కోసం వారిని స్టేషన్ లో ఉంచినట్టు కనిపిస్తోంది. ఈ ‘చిత్రం చూడర’ సినిమాకు ఆర్ ఎన్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీ పై ఉత్కంఠ పెరిగింది. అలాగే ఈ సినిమాలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ తదితరులు తెరపై కనిపించనున్నారు. అంతే కాకుండా ‘నేనింతే’ మూవీ ఫేమ్ అతిథి గౌతమ్ ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది.


2007 లో వచ్చిన ‘హ్యపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ హిట్ కావడంతో తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీలలో ఈ సినిమా కూడా ఉంటుంది. అంతగా యూత్ ను అట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఈ మూవీ తర్వాత వరుణ్ కు అంతగా హిట్ మళ్లీ రాలేదు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు వరుణ్. అయినా ఆయనకు సరై హిట్ ఇప్పటి వరకూ పడలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడట వరుణ్. అందుకే ఈ ‘చిత్రం చూడర’ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడట. మరి వరుణ్ ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి. ఈ సినిమాను బి ఎం సినిమాస్ బ్యానర్ లో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాధన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.