బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌ సతీమణి, బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ తల్లి అయేషా ష్రాఫ్‌ దారుణంగా మోసపోయింది. ఓ కిక్ బాక్సర్ ను నమ్మి ఏకంగా రూ. 58 లక్షలు పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు మోసగాడిని అరెస్టు చేశారు.  ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. ఇంతకీ ఆయేషా అన్ని లక్షలను ఎలా మోసపోయింది?


రూ. 58.53 లక్షలు దారి మళ్లించిన అలెన్   


అయేషా ష్రాఫ్ తన కుమారుడైన టైగర్‌ ష్రాఫ్‌ సంస్థలో అలన్ ఫెర్నాండెజ్‌ను స్టాఫర్‌గా నియమించారు. కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఫైటర్ గా ఉన్న అలన్ ఫెర్నాండెజ్‌ను టైగర్ ష్రాఫ్ MMA మ్యాట్రిక్స్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమించారు. కంపెనీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తుంది. దాని వ్యవహారాలు అయేషా ష్రాఫ్ నిర్వహిస్తున్నారు. కంపెనీ డైరెక్టర్ గా ఉన్న అన్, ఇండియాతో పాటు, విదేశాలలో 11 టోర్నమెంట్ లు నిర్వహించడానికి డబ్బు వసూలు చేశాడు. ఆ డబ్బును కంపెనీ అకౌంట్ లో కాకుండా తన వ్యక్తిగత అకౌంట్ లోకి మళ్లించుకున్నాడు. ఈ డబ్బు సుమారు రూ. 58.53 లక్షలు ఉంటుందని ఆయేషా తెలిపారు. విషయం తెలిసి ఆమె శాంటాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. 


టోర్నమెంట్ల నిర్వహణ పేరుతో డబ్బు వసూలు, సొంత ఖాతాలోకి మళ్లింపు


ఆయేషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇచ్చిన వివరాల మేరకు అలెన్ ను గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయేషా ష్రాఫ్‌ ఫిర్యాదు మేరకు, రూ.58 లక్షలు మోసం చేసిన నిందితుడిన అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. "ఫెర్నాండెజ్ 2018లో MMA మ్యాట్రిక్స్ సంస్థలో డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఆ సంస్థ ద్వారా భారతదేశంతో పాటు విదేశాలలో 11 టోర్నమెంట్‌లను నిర్వహించడానికి డబ్బు వసూలు చేసి, తన వ్యక్తిగత ఖాతాలో రూ. 58.53 లక్షలు జమ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి" అని పోలీసు అధికారులు తెలిపారు.


మోసగాడిని కఠినంగా శిక్షించాలని కోరిన ఆయేషా


నిందితుడు అలెన్ పై శాంటాక్రూజ్ పోలీసులు మోసం, నేరపూరిత వ్యవహారం, విశ్వాస ఉల్లంఘనతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  అతడిని కోర్టు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. విచారణలో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు వెల్లడించారు. కంపెనీలో ఉన్నత పదవి ఇస్తే, ఇలాంటి చీటింగ్ కు పాల్పడ్డం అసహ్యంగా ఉందని ఆయేషా తెలిపారు. మోసగాడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.






Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు