Teja Sajja About ‘Guntur Karam’ Movie: ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి ‘గుంటూరు కారం’, తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘హనుమాన్’, అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సహా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టపడే సంక్రాంతి రోజున పలు సినిమాలు విడుదల కావడం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే రోజు ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ విడుదల
మిగతా సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే, మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’ ఈ నెల 12న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా నటిస్తున్న 'హనుమాన్' చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా భారత్ తో పాటు శ్రీలంక, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ సహా పలు దేశాల్లో మొత్తం 11 భాషల్లో విడుదల చేస్తున్నారు. అదే రోజున అంటే జనవరి 12న మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ కూడా రిలీజ్ కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేనంత ఊర మాస్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి పోటీగా ‘హనుమాన్’ చిత్రం రావడం ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది.
ఒకప్పుడు మహేష్ కొడుకుగా నటించిన తేజ
వాస్తవానికి మహేష్ బాబు సినిమాకు పోటీగా వస్తున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో ఆయన కొడుకుగా నటించాడు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తేజ సజ్జ, 2000 సంవత్సరంలో మహేష్ హీరోగా నటించిన 'యువరాజు' మూవీలో నటించాడు. ఇందులో మహేష్ కొడుకుగా కనిపించాడు. అప్పుడు కొడుకుగా నటించిన తేజ, ఇప్పుడు మహేష్ కి పోటీగా రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.
మహేష్ తో పోటీ కాదు- తేజ సజ్జ
తాజాగా తాను మహేష్ బాబుకు పోటీగా వస్తున్నట్లు వైరల్ అవుతున్న వార్తలపై తేజ సజ్జ స్పందించారు. “సూపర్ స్టార్ తో పోటీ కాదు, ఆయనతో పాటుగా” అంటూ వివరణ ఇచ్చారు. తేజ సజ్జ స్పందనపై మహేష్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆయన స్పందించిన విధానం చాలా బాగుంది అంటున్నారు. ‘హనుమాన్’ మూవీలో ఓ యువకుడికి హనుమాన్ వల్ల సూపర్ పవర్స్ వస్తే ఎలా వాటిని ఉపయోగిస్తాడు? అనే విషయాన్ని చూపించబోతున్నారు. అటు ‘గుంటూరు కారం’ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?