Baby Movie: యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్స్ చేసే సినిమాల్లో లవ్ స్టోరీస్ జోనర్ ఒకటి. దీనిపై ప్రతీ ఏడాదీ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే తీసుకున్న పాయింట్ ను స్క్రీన్ పై కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడంలో కొంతమంది దర్శకులు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్ లోల వచ్చిన ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ ‘బేబీ’ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. 


‘బీబీ’ పై మాస్ మహరాజ్ ప్రశంసలు..


‘బేబీ’ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రస్తుత జనరేషన్ లో జరిగే లవ్ స్టోరీస్ ను బేస్ గా చేసుకొని దర్శకుడు తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ఎమోషన్స్ సీన్స్ ను కలగలిపి చూపించిన విధానం యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది. అందుకే ఈ మూవీకు యూత్ ఎక్కువగా వెళ్తున్నారు. ఈ సినిమా పై విమర్శకుల ప్రశంసలే కాకుండా పలువురు సినీ సెలబ్రెటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ ‘బేబీ’ మూవీపై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు రవితేజ. ‘‘ఈరోజు ‘బేబీ’ చూశాను. బాగా నచ్చిది. దర్శకుడు సాయి రాజేష్ మూవీను ఎంతో అద్భుతంగా రూపొందించారు. సాంకేతిక బృందం కూడా బాగా పని చేసింది. ముఖ్యంగా విజయ్ బల్గానిన్ సంగీతం చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు  వారి వారి పాత్రల్లో గొప్పగా నటించారు. ఇలాంటి కథను నిర్మించడానికి ముందుకొచ్చిన ఎస్కెఎస్ కు అలాగే మాస్ మూవీ మేకర్స్ కు అభినందనలు’’ అంటూ రవితేజ్ పోస్ట్ చేశారు.  దీంతో రవితేజ్ అభిమానులు కూడా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 


కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘బేబీ’..


‘బేబీ’ మూవీకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూవీ విడుదలైన మొదటి రోజే సుమారు రూ.7.1 కోట్ల గ్రాస్ ను సాధించిందీ మూవీ. రెండో రోజు కూడా కొంచెం అటు ఇటుగా రూ.7 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఆదివారం ఏకంగా రూ.14 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించింది. ఇకా వారాంతానికి రూ.23 కోట్లకుపైగానే కలెక్షన్స్ సాధించింది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే మూవీ ఫుల్ రన్ లో రూ.50 కోట్ల వసూళ్ళు సాధించడం ఖాయమని అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. మరి ‘బేబీ’ ఓవరాల్ గా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.