మిళ నటుడు ఉదయనిధి హీరోగా మరి సెల్వరాజ్ దర్వకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మామన్నన్’. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నై లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ నటుడు కమల్ హాసన్ అథితిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ స్టేజీపై పాటలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన చాలా సేపు సాగింది. అయితే ఈ పాటల ప్రదర్శన సమయంలో కమల్ హాసన్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


కన్నీరు పెట్టుకున్న కమల్ హాసన్..


‘మామన్నన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా లైవ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో చిత్రం మొదటి సింగిల్ ట్రాక్ ‘రాస కన్ను’ పాటను నటుడు వడివేలుతో కలసి ఏ.ఆర్.రెహమాన్ పాడారు. ఈ పాట ప్రదర్శన సమయంలో కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు. వేదికపై పాట పాడుతుంటే భావోద్వేగానికి గురైన కమల్ కంట నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రదర్శన అనంతరం ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడారు.. సినిమా దర్శకుడు మరి సెల్వరాజ్ మంచి సినిమాను రూపొందించారని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెప్పారు. ఈ పొలిటికల్ డ్రామా సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు కమల్. ఇక ఈ సినిమాలో ఉదయనిధితో పాటు కీర్తి సురేష్, ఫాహద్ ఫాసిల్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. 


ఉదయనిధికు ఇదే చివరి సినిమానా?


‘మామన్నన్’ సినిమా తర్వాత ఉదయనిధి ఇక సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గా ఉన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అందుకే తాను కూడా పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళనున్నట్లు తెలిపారు. అయితే ఆయన భవిష్యత్ లో మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అనేది ఆయన రాజకీయ అభివృద్ది మీద ఆధారపడి ఉంటుంది. ఏదైమైనా ఉదయనిధి సినిమాలకు దూరం కావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి. 


వరుస సినిమాల్లో కమల్ హాసన్..


ప్రస్తుతం కమల్ హాసన్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ హాసన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాలోని స్టోరీ, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా తర్వాత కమల్ ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో కూడా విలన్ నటించడానికి ఓకే చెప్పారనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం భారీగానే కలమ్ కు ముట్టచెప్పారట నిర్మాతలు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Also Read: కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!