Just In

అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?

బాలుని మరోసారి అవమానించిన సంజయ్.. మౌనిక నిజం చెప్పేస్తుందా- గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 23 ఎపిసోడ్ హైలెట్స్!

నువ్వుంటే నా జతగా సీరియల్: పురుషోత్తానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మిధున.. దేవాని అల్లుడిగా అంగీకరించిన లలిత!

ఇంటి అడ్రస్ చెప్పిన కళావతి.. కంపెనీ బాధ్యతలు తీసుకున్న రాజ్ - బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 23 ఎపిసోడ్ హైలెట్స్!

చిన్ని సీరియల్: తల్లిదండ్రుల్ని ఒకటి చేయాలన్న చిన్ని సంకల్పం నెరవేరుతుందా.. సత్యం దేవా అడ్రస్ కనిపెడతాడా!
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గేమ్ స్టార్ట్ చేసిన మనోహరి – పిల్లలతో గెలవమన్న అనామిక
Puspha Viral Video: సుక్కు, బన్నీ చేసిన పని, వీడియో షేర్ చేసిన జగ్గూభాయ్
సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్ లో ఓ షోకి హాజరయ్యారు. అందులో పాండా బొమ్మ 'పుష్ప'లో పాటకి స్టెప్స్ వేస్తూ కనిపించింది.
Continues below advertisement

వీడియో షేర్ చేసిన జగ్గూభాయ్
ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడం వేరు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం వేరని చెప్పాలి. ఈ మధ్యకాలంలో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించిన సినిమా ఏదైనా ఉందంటే 'పుష్ప' అనే చెప్పాలి. ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందంట.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ.. బన్నీ మేనరిజమ్స్ ను ఫాలో అయిపోతున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా 'పుష్ప'కి భారీ క్రేజ్ వస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో 'తగ్గేదేలే', 'శ్రీవల్లి' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 'శ్రీవల్లి' పాటలో బన్నీ వేసిన స్టెప్ ఓ రేంజ్ లో జనాల్లోకి వెళ్లింది. చెప్పు జారిపోతే తిరిగి తొడుక్కుంటూ బన్నీ వేసే స్టెప్ ను అందరూ అనుకరిస్తున్నరు. ఇప్పటివరకు సెలబ్రిటీలు, క్రికెటర్స్, ఫ్యాన్స్.. ఈ స్టెప్ ను అనుకరిస్తే.. ఇప్పుడు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా 'శ్రీవల్లి' స్టెప్పును వేస్తూ 'తగ్గేదేలే' అనే డైలాగ్ చెప్పడం హైలైట్ అవుతోంది.
సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్ లో ఓ షోకి హాజరయ్యారు. అందులో పాండా బొమ్మ 'పుష్ప'లో పాటకి స్టెప్స్ వేయగా అక్కడే ఉన్న జగపతిబాబు.. 'బన్నీ, సుక్కు చేసిన పని.. పాండా కూడా డాన్స్ చేస్తోంది.. దాంతో కలిసి నేను కూడా స్టెప్ వేశాను.. ఈ సినిమా ఇంతగా జనంలోకి తీసుకెళ్లిన 'పుష్ప' టీమ్ కి హాట్సాఫ్' అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం 'పుష్ప' 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Continues below advertisement