మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో రామ్‌చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించున్నాడు. చెర్రీ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ సందర్భంగా ‘ఆచార్య’ టీమ్.. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కోసం మరో అప్‌డేట్ ఇచ్చింది.
‘ఆచార్య’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘‘లాహే లాహే’’ సాంగ్‌కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఇదే క్రమంలో రామ్‌చరణ్, పూజా హెగ్డేల ‘నీలంబరి’ సాంగ్ కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గురువారం ‘నీలంబరి’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్ ‘క్లాసికల్’ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘‘నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలా మరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి’’ అనే పాట, చరణ్ ‘క్లాసికల్’ స్టెప్పులు తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. పూజా కూడా లంగావోణిలో అదిరిపోతోంది. నవంబర్ 5న (శుక్రవారం) ఉదయం 11.07 గంటలకు ఈ పాటను విడుల చేయనున్నారు. ఈ పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. సుమారు 15 సంవత్సరాల తర్వాత చిరంజీవితో మణి శర్మ చేస్తున్న అతిపెద్ద సినిమా ఇదే. గతంలో చిరంజీవి-మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన విషయం సీని ప్రేమికులకు తెలిసిందే. చరణ్-నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు
Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు
Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
ఇట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి