Aamir Khan: తండ్రీకూతుళ్లని పట్టుకుని ఏమిటా ప్రశ్న? ఈ నెటిజన్‌కు బొత్తిగా బాలీవుడ్ నాలెడ్జ్ లేనట్టుందే...

ఆమీర్ ఖాన్ కూతురికి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకి ఆమె ఎంత అందంగా రియాక్ట్ అయ్యిందో మీరే చదవండి.

Continues below advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఆమిర్ ఖాన్ ఒకరు. ఆయనకు భారతీయుల్లో ఎంతో మంది వీరాభిమానులున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన తన రెండో భార్య కిరణ్ రావ్‌తో విడిపోయినట్టు ప్రకటించారు. కిరణ్ రావ్ కన్నా ముందు ఆయన రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఐరా ఖాన్ అనే కూతురు, జునైద్ ఖాన్ అనే కొడుకు ఉన్నారు. వీరిద్దరూ 2002లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటికి ఆ ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. తరువాత లగాన్ సినిమా షూటింగ్ టైమ్‌లో కిరణ్ రావ్‌తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరకీ ఒక కొడుకు ఆజాద్ ఉన్నాడు. సరోగసీ పద్ధతిలో వారికి జన్మించాడు. 

Continues below advertisement

కాగా ఇప్పుడు ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ యుక్తవయసుకు వచ్చింది. హీరోయిన్లకి తీసిపోని అందంతో మెరిసిపోతోంది. అయినా కూడా ఆమె ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్ స్టాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఐరా. కాగా ఆమె తాజాగా తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. దానికి ఓ నెటిజన్ ఆమె విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ‘అతను మీ బంధువా? అంతా దగ్గరగా కూర్చున్నావ్’ అని ప్రశ్నించాడు.  దీనికి ఇతర నెటిజన్లంతా రియాక్ట్ అయ్యారు. ‘నీకు తెలియదా వారిద్దరూ తండ్రీ కూతుళ్లు’ అని ఒక నెటిజన్ మెసేజ్ పెట్టగా, మరొకరు ‘ఏ దేశంలో ఉంటున్నావ్? ఆమె ఆమీర్ ఖాన్ కూతురు’ అని, ఇంకొకరు ‘గూగుల్ సెర్చ్ చెయ్యి ఆమీర్ ఖాన్ కూతురు ఎవరని? మీకే తెలుస్తుంది’ అని రిప్లయ్‌లు ఇచ్చారు. 

మరొక నెటిజన్ గూగుల్ కూడా చాలా సార్లు తప్పులు చూపిస్తుంది అని మెసేజ్ చేశాడు. దీనికి ఐరా స్పందించింది. ‘అవును నిజమే... గూగుల్ లో చూపించేవన్నీ నమ్మకూడదు’ అని కామెంట్ చేసింది. ఆమీర్ ఖాన్ చాలా పాపులర్ వ్యక్తి అయినా అతని కూతురి గురించి చాలా మందికి తెలియకపోవడం వింతే. ఒక్కోసారి బాలీవుడ్ హీరోలు, వారి ఫ్యామిలీల గురించి తెలియని వ్యక్తుల వల్ల ఇలా ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. 

Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!

Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!

Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!

Also Read: ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement