1134 Movie Release date: కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనంతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గతంతో పోలిస్తే కాన్సెప్ట్ బేస్డ్, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలు పెరిగాయి. ఆ జాబితాలో ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఓ చిన్న సినిమా కూడా ఉందని చెప్పాలి.


డిసెంబర్ 15న '1134' సినిమా విడుదల
శరత్ చంద్ర తడిమేటి (Ssharadh Chandra Tadimeti)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.... రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా సంస్థలపై తెరకెక్కిన సినిమా '1134'. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు సైతం శరత్ చంద్ర చూసుకున్నారు. భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాత. ఇదొక ప్రయోగాత్మక సినిమా. 


హైదరాబాద్ సిటీలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వరుస దొంగతనాలు, వాటికి కారణమైన వ్యక్తులను పట్టుకున్న పోలీసులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీశారు. కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, ఫణి శర్మ, గంగాధర్... '1134' సినిమా ద్వారా ఐదుగురు కొత్త కుర్రాళ్లను శరత్ చంద్ర తడిమేటి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 


కారు నంబరే సినిమా టైటిల్?
'హైదరాబాద్ నగరం నిద్రపోతున్న వేళ వాళ్ళు విరుచుకుపడ్డారు' అని అర్థం వచ్చేలా '1134' ట్రైలర్ చివరలో ఓ కొటేషన్ ఉంచారు. మిడ్ నైట్ జరిగిన దొంగతనాల నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు.


Also Readహిందీ సినిమాలు 4, తమిళ సినిమాలు 2... తెలుగు నుంచి ఒక్కటీ లేదు - 2023లో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్



December 15th Telugu movie release: ఒకరి ఒకరు పరిచయం లేని ముగ్గురు వ్యక్తులు కలిసి తొలుత దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వాళ్ళకు మరో వ్యక్తి తోడు అవుతారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఎన్ని దొంగతనాలు చేశారు? వాళ్ళను యంగ్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనేది సినిమా కథగా అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తే ఓ కారును హైలైట్ చేశారు. దాని నంబర్ 1134. చివరకు, దానిని టైటిల్ కింద కన్ఫర్మ్ చేశారు. మరి, కారు కూడా కీ రోల్ ప్లే చేస్తుందేమో చూడాలి. 


Also Read: మరీ ఇంత బూతా నితిన్ - ఆ వల్గర్ పాట ఏంటి? ఎక్స్‌ట్రా సాంగ్‌పై ఆడియన్స్ ఫైర్



కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : శ్రీ మురళీ కార్తికేయ, సినిమాటోగ్రఫీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి, నిర్మాణ సంస్థలు: రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా, సహ నిర్మాత : భరత్ కుమార్ పాలకుర్తి, దర్శకత్వం : శరత్ చంద్ర తడిమేటి.