YCP   given chance to three women candidates in Srikakulam district : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి అధికార పార్టీ అవకాశం కల్పించగా టీడీపీ కూటమి మాత్రం ఒక్కస్థానానికే పరిమితం చేసింది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించగా కూటమిలో మాత్రం ఒక్క స్థానానితో సరిపెట్టుకుంది.   జిల్లా నుంచి ఎప్పటిలాగానే మహిళా ఓటర్లు శాతం అధికం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రతాంబులాం ఇచ్చినట్టే. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఆ ప్రాధాన్యత కల్పించింది. గతేడాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ నియోజకవర్గంలో విశ్వాసరాయి కళావతి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగగా, ఈ రెండు స్థానాలు ఆయా నియోజకవర్గ ప్రజలు వారిద్దరికి పట్టం కట్టారు. అదే టీడీపీ నుంచి పరిశీలిస్తే శ్రీకాకుళం నుంచి గతసారి ఎన్నికల్లో జిల్లా నుంచి పలాస, శ్రీకాకుళం నియోజక వర్గాల నుంచి గౌతు శీరిష, గుండ లక్ష్మీదేవి బరిలో దిగగా వారిద్దరు ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో పాలకొండ, పాతపట్నంతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను బరిలో దించి ముగ్గురి మహిళలకు అవకాశం కల్పించింది.                                           


టీడీపీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వగా అందుకు భిన్నంగా ఈ సారి ఒకే స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీలో చర్చనీయాంశమౌతుంది. లక్ష్మీదేవి స్థానంలో నిన్నటి వరకు టీడీపీ రెబల్గా ఉన్న గొండు శంకర్ కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో గుండ వర్గీయులంతా ఆమెను స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగమంటున్నారు. అధిష్టానం రాయ బారాలు చేస్తున్నారు. మరి అధిష్టానం పున:పరిశీలించి గత ఎన్నికల మాదిరిగా లక్ష్మీదేవికి టికెట్ ఇస్తే, ఇద్దరు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే మహిళ కోటా తగ్గిపోయి ఒక్కరికే ఆ పార్టీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అందుచేత వైసీపీకి ధీటుగా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వడం వల్ల మిగిలిన నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రభుత్వం సంక్షేమ పథకాలు వైసీపీలోనే అమల వుతున్నాయని, వారికి అగ్రతాంబులం ఇచ్చేది సీఎం జగన్మోహన్రెడ్డి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులు ఏ రాజకీయ ప్రసంగంలో కూడ ఈ ప్రస్థావన తప్పని సరిగా మారింది. డ్వాక్రా గ్రూపులకు సృష్టి కర్త టీడీపీ అధినేత చంద్రబాబు అంటు ఆ పార్టీ శ్రేణు లు ప్రచారాలు చేస్తుంటారు. ఓటర్లకు కనిపిం చేది నేరుగా ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ల కేటా యింపులో వైసీపీ ప్రాధాన్య తిచ్చిందని చర్చిం చుకుంటున్నారు. మరి టీడీపీ మనసు మార్చుకుని శ్రీకాకుళం టిక్కెట్ తిరిగి మహి ళకు అవకాశం కల్పిస్తారా... లేక శంకర్ ను కొనసాగిస్తారా అనేది టీడీపీ అధి ష్టా నం తీసుకునే నిర్ణయం ఉంటుంది.