Who will win in Hindupuram : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. టీడీపీ ఏర్పాటు తర్వాత అక్కడ మరో పార్టీ గెలవకపోవడం ఓ కారణం అయితే నందమూరి బాలకృష్ణ మూడో సారి గెలిచేందుకు ప్రయత్నించడం మరో కారణం. ఎలాగైనా కంచుకోటను  బద్దలు కొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. అందుకే గెలుపెవరిది.. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా అన్నది ఆసక్తికరంగా మారింది. 


హిందూపురంలో అన్ని  పార్టీల ధీమా 
 
హిందూపురంలో ఎవరికి వారు  గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది.  అందులో హిందూపురం ఒకటి.  40 ఏళ్ల నుంచి ఒకే పార్టీ గెలుస్తూ వస్తుంది..  ఇప్పుడు అందరి కళ్ళు హిందూపురం నియోజకవర్గ ఫలితాలపైనే ఉన్నాయి.  40 ఏళ్లుగా హిందూపురంలో తెలుగుదేశం జెండానే ఎగురుతూనే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెడ్డి సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనే బరిలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతానని బాలయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఈ సారి టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామన్న వైసపీ 


 అటు వైసిపి కూడా ఈసారి హిందూపురంలో ఎట్టి పరిస్థితిలో జెండా ఎగరవెయ్యాలనికృత నిశ్చయంతో ఉంది.   వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అభిమాన నటుడు బాలకృష్ణని ఈసారి ఓడించి హిందూపురం నియోజకవర్గం లో వైసిపి జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు.  టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపూర్ లో ఇప్పటివరకు వేరే పార్టీ అక్కడ గెలిచిందే లేదు. హిందూపూర్ మొదటి నుంచి టిడిపికి కంచుకోట... దీంతో గతంలో ఇతర పార్టీలు హిందూపూర్ లో గెలుపు పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.  బాలకృష్ణ కు పోటీగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కురుబ దీపిక రెడ్డి హిందూపురం నుంచి బరిలోకి దిగారు.  నువ్వా నేనా అన్నట్లు హిందూపురంలో  పోటా పోటీగా వైసీపీ  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి వేవ్ నడిచిన.. హిందూపూర్ లో బాలకృష్ణ 2014లో వచ్చిన మెజార్టీ కంటే... ఎక్కువగానే 2019 లో తెచ్చుకుని గెలుపొందారు. దీంతో వైసిపి అధిష్టానం ఈసారి బాలకృష్ణ పై పోటీకి బీసీ మహిళను రంగంలోకి దించింది. 


బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళ అనే నినాదం


బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళ నినాదంతోనే వైసిపి విస్తృతంగా ప్రచారం చేసింది. 2014లో వచ్చిన మెజారిటీ కంటే 2019లో ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్న బాలకృష్ణ... మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2019లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉంటే.... బాలయ్య హ్యాట్రిక్ కు బ్రేక్ వేసి... 40 ఏళ్ల టిడిపి కంచుకోటలో వైసిపి జెండా ఎగరవేస్తామని జోస్యం చెబుతున్నారు వైసిపి నాయకులు. ఇంతకీ హిందూపురం ఓటర్లు బాలయ్య హ్యాట్రిక్ కు ఓటు వేశారా.. లేక హిందూపురంలో కొత్త జెండాను ఎగరేస్తారా అన్నది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.