Which Of The Following Category Of Voters Are Entitled To Vote By Post: దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కీల‌క‌మైన కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే ఈ సార్వ‌త్రిక స‌మ‌రంలో ఓటు హ‌క్కు(Right of Vote) ఉన్న ప్ర‌తి పౌరుడు త‌న హ‌క్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు.. వీవీఐపీ(VVIP)ల‌కు స‌మానంగానే.. పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తారు. అక్క‌డ‌కు వ‌చ్చే వారు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రక్రియ‌లో అంద‌రూ పాల్గొనాల నే నిబంధ‌న లేక‌పోయినా.. ఇటీవ‌ల పెరిగిన చైత‌న్యం, ఓటు హ‌క్కుపై పెరిగిన ప్ర‌చారం నేప‌థ్యంలో గ‌త కొన్నాళ్లుగా ఓటు హ‌క్కు వినియోగించుకునే వారిసంఖ్య పెరుగుతూ వ‌చ్చింది. అయితే.. సాధార‌ణ ప్ర‌జ‌లు, వీఐపీలు ఓకే. మ‌రి ఇదేస‌మ‌యంలో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వ‌హించే వారి ప‌రిస్థితి ఏంటి? అదేవిధంగా అత్యవ‌స‌ర సేవ‌లైన పోలీసులు, వైద్య‌, ఫైర్, ర‌క్ష‌ణ‌, మిలిట‌రీ, వాయుసేన‌, వైమానిక, రైల్వే, ర‌వాణా రంగాల్లోని వారు ఓటు హ‌క్కు ఎలా వినియోగించుకోవాలి. వీరు ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ వారి నివాసాల‌కు, ప్రాంతాల‌కు దూరంగా విధుల్లో ఉంటారు. మ‌రి ఇలాంటివారు ఎలా త‌మ ఓటును వేయ‌గ‌లుగుతారు? అనేది ప్ర‌శ్న‌. ఇలాంటి వారికోస‌మే.. 1960ల నుంచి పోస్ట‌ల్ బ్యాలెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 


ఏంటీ పోస్ట‌ల్ బ్యాలెట్‌.. (What is postal ballot ?)


ఎన్నిక‌ల పోలింగ్ తేదీకి ముందే.. అంటే సాధార‌ణ ప్ర‌జ‌లు ఓటు వేయ‌డానికి ముందే. కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించిన ఉద్యోగులు.. `12 డి`(Form-12D) ఫాంను నించి.. సంబంధిత ఎన్నిక‌ల ప్ర‌త్యేక నోడ‌ల్ అధికారికి అందించి.. త‌ద్వారా పోస్టు ద్వారా త‌మ ఓటును వేసే అవ‌కాశం పొంద‌వ‌చ్చు. ఇవి ఈవీఎంల మాదిరిగా కాకుండా.. ఓట‌రు స్లిప్పుల రూపంలోనే ఉండ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు లెక్కించే రోజు కూడా తొలుత వీటినే లెక్కిస్తారు. ఈ 12 డి ఫాంల‌ను ఆయా ఉద్యోగులు ప‌నిచేసే కార్యాల‌యాల్లోనూ . ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన అనుమ‌తి మేర‌కు నియ‌మితులైన నోడ‌ల్ అధికారి కార్యాల‌యంలోనూ ఉంటాయి. త‌ద్వారా.. ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందే.. ఉద్యోగులు, డాక్ట‌ర్లు, పోలీసులు, ఆర్మీ స‌హా.. అన్ని ప్ర‌భుత్వ అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగాల వారు ఓటు హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం ఉంది. 


తాజా ఆదేశాలు ఇవీ.. (What is all about Postal Ballot Companies Act 2013?)


దేశ‌వ్యాప్తంగా ఉద్యోగులు(Employees), ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు(Doctors), ఆర్మీ(Army) స‌హా ఇత‌ర 24 గంట‌ల సేవ‌ల్లో ఉండేవారికి పోస్టల్ బ్యాలెట్(Postal ballet) అవకాశాన్ని క‌ల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఏపీ లోక్‌స‌భతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా విభాగాల వారు.. ఈ పోస్ట‌ల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం కోరింది. ఆయా విభాగాల్లో సేవలందించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించింది. దీనికిగాను ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి `12 డి` ఫామ్(What is Form 12 D) అందుబాటులో ఉంచాల్సిందిగా కేం ద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారి సం బంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
గురించి తెలియజేయ‌డంతోపాటు అవ‌గాహ‌న కూడా క‌ల్పించ‌నున్నారు. 
 
దేశ‌వ్యాప్తంగా వీరికి కామ‌న్‌ అవ‌కాశం.. 


1. మెట్రో న‌గ‌రాల్లో సేవ‌లు అందించే ఉద్యోగులు
2. రైల్వే రవాణా(ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు
3. పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికారిక లేఖలు పొందిన మీడియా ప్ర‌తినిధులు
4. విద్యుత్ శాఖ
5. బీఎస్ఎన్ఎల్
6. పోస్టల్-టెలిగ్రామ్
7. దూరదర్శన్
8. ఆలిండియా రేడియో 
9. రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు
10. ఆరోగ్య శాఖ 
11. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్
12. విమాన సిబ్బంది, ప్ర‌యాణికులు కూడా
13. రోడ్డు రవాణా సంస్థ  ఉద్యోగులు(దేశ‌వ్యాప్తంగా)
14. అగ్నిమాపక సేవలు 
15.  పోలీసులు
16. అంబులెన్స్ సేవలు
17. షిప్పింగ్
18. ఫైర్ ఫోర్స్
19. జైళ్లు
20. ఎక్సైజ్
21. వాటర్ అథారిటీ
22. ట్రెజరీ సర్వీస్ 
23. సమాచార, ప్రజా సంబంధాల శాఖ
24. అటవీ
25. పోలీసు 
26. పౌర రక్షణ - హోంగార్డులు 
27. ఆహార పౌర సరఫరాలు -వినియోగదారుల వ్యవహారాలు
28. ఎనర్జీ
29. ఎయిర్పోర్ట్ అథారిటీ
ఆఫ్ ఇండియా
30. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 
31. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి 
32. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్
33. విపత్తు నిర్వహణ