warangal police commissioner: వరంగల్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం అయ్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ప్రణాళికను రూపొందించి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనేందుకుగా అవసరమైన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఎనిమిది శాసనసభ స్థానాలతో పాటు, పోగురు జిల్లాలకు చెందిన పాక్షికంగా వున్న హుస్నాబాద్‌, హుజురాబాద్‌, భూపాల్‌పల్లి స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రశాంతవంతమైన వాతవరణంలో నిర్వహించేందుగా  అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ఆ ప్రాంతాల్లో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు పోలీస్‌ కమిషనర్‌. 
కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ ఈస్ట్‌, వరంగల్‌ వెస్ట్‌, వర్థన్నపేట, పరాకల, జనగామ, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 1128 పోలీంగ్‌ ప్రాంతాల్లో, 2126 పోలింగ్‌ బూత్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణకై డీసీపీ స్థాయి నుండి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 4వేల మంది పోలీస్‌ సిబ్బందిని నియమించడంతోపాటు 17 వందలకు పైగా  కేంద్ర సాయుధ పోలీసులు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే పెట్రోలింగ్‌ పార్టీలు, క్విక్‌రియాక్షన్‌ విభాగాలు, స్ట్రెకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రెకింగ్‌ ఫోర్స్‌ బృందాలను ఎర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియామవళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. 


ఎన్నిక కొడ్‌ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన తనీఖీల్లో  మొత్తం 12కోట్ల 33 లక్షల రూపాయలకు పైగా డబ్బు పోలీస్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. దీనితో పాటు, 55 లక్షల రూపాయల విలువల మద్యం సిసాలు, గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకోగా, పది లక్షల విలువగల ఐదు వందల కిలోల నల్లబెల్లం, పటిక, ఒక కోటి 64లక్షల రూపాయల విలువైన 667 కిలోల గంజాయి, ఆరున్నర కిలోల బంగారు, కిలోన్నర వెండి అభరణాలతో పాటు, ఓటర్లకు అందించేందుకు 13లక్షల రూపాయల విలువగల బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 842 కేసులను నమోదయ్యాయని తెలిపారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌ విభాగం పలు అంశక్షలను, ఎన్నికల ప్రవర్తన నియామవళిని  ప్రజలు, పాటించాలని. నేటి సాయంత్రం నుంచి 4వ తేది వరకు 144 సెక్షన్‌ అమలు చేయబడుతుందన్నారు. ఈ సమయంలో నలుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపుగా ఉండడంపై నిషేధం ఉందని సీపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ సమావేశంలో  డీసీపీ రవీందర్, అబ్దుల్ బారి, బి. ఎస్. ఎఫ్ కామెండెంట్ లు హెచ్. ఎస్. సాయిని, ముకేశ్ కుమార్, ఎస్. బి ఏసీపీ లు జితేందర్ రెడ్డి, రమేష్, ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.