UP Election Result 2022 LIVE: యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ, మరో 65 స్థానాల్లో ఆధిక్యం
UP Election Result 2022 LIVE updates: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్(202)ను బీజేపీ దాటేసింది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 208 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 78 స్థానాల్లో గెలుపొందింది. మరో 46 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉంది.
యూపీలో బీజేపీ దూసుకుపోతుంది. తాజా ఫలితాల మేరకు 196 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, మరో 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీ 70 స్థానాల్లో గెలవగా, 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూపీలో వరుసగా రెండో సారి బీజేపీ అధికారం చేపట్టే దిశంగా ఫలితాలు ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని మాట్లాడుతూ.. ‘‘బుల్‌డోజర్ ముందు ఏదీ నిలబడదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం యూపీలో బీజేపీ అఖండ విజయం సాధించబోతోంది. మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని మాకు ముందే తెలుసు. యూపీలో మేం అభివృద్ధికి కృషి చేశాం. అందుకే ప్రజలు మమ్మల్ని నమ్మారు. బుల్డోజర్ ముందు ఏదీ నిలవలేదు. అది సైకిల్ అయినా ఏదైనా సరే నిమిషాల్లో బుల్డోజర్ తొక్కేయగలదు’’ అని అన్నారు.
Keshav Prasad Maurya Trailing: ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు. కౌశాంబిలోని సిరతు స్థానం నుంచి కేశవ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పల్లవి పటేల్ ఉన్నారు. ఈ పల్లవి పటేల్ అప్నా దళ్ జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ సోదరి. దీంతో స్థానంలో గెలుపై అందరి చూపు ఉంది. కేశవ్ మౌర్య దాదాపు 6 వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు. అంతకుముందు ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా కూ యాప్‌లో పోస్ట్ చేస్తూ.. బీజేపీ గెలుస్తోందని, గూండాయిజం ఓడిపోతోంది అని రాసుకొచ్చారు.
UP Elections Counting Trends: యూపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ట్రెండ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. గోరఖ్‌పూర్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి నుంచి ముందంజలోనే ఉన్నారు. యోగి తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 26 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ జోరే కనిపిస్తుండడంతో ఇప్పటికే బీజేపీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
గోరఖ్‌పూర్‌లో ప్రస్తుతానికి పోలైన ఓట్లు
యోగి ఆదిత్యనాథ్ - 38,633
శుభావతి ఉపేంద్ర దత్ శుక్లా - 12,357
ఖ్వాజా షంసుద్దీన్- 2707
డాక్టర్ చేతనా పాండే- 516
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 254 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుండడంతో ఆ పార్టీ గెలుపే ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* BJP+ - 254
* SP+ - 122
* INC - 6
* BSP - 5
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 162 స్థానాల్లో మెజార్టీ కనబరుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో జోరు కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథి జిల్లాల్లో ఉండే నాలుగు స్థానాల్లోనూ బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు అయోధ్య జిల్లాలోని 5 స్థానాల్లో బీజేపీ 4, ఎస్పీ ఒక స్థానంలో కొనసాగుతున్నాయి. గతంలో వార్తల్లో నిలిచిన ఉన్నావ్‌లో 6 స్థానాలు ఉండగా బీజేపీ, ఎస్పీలు చెరి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఉదయం 10 గంటల సమయానికి ఉన్న సమాచారం ప్రకారం వివరాలివీ..
* BJP+ 239
* SP+ 108
* INC 6
* BSP 5
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఏకంగా 152 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. దీంతో అప్పుడే యూపీలో బీజేపీ శ్రేణుల సంబరాలు మొదలైపోయాయి. మరోవైపు, ఎస్పీ 81, బీఎస్పీ 5, కాంగ్రెస్ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
గోరఖ్ పూర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందంజలో కొనసాగుతున్నారు. 8.40 గంటల సమయానికి బీజేపీ యూపీలో 111 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఎస్పీ కూటమి 67 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ 5 స్థానాల్లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. యూపీలో కీలక నేతలైన అఖిలేష్ యాదవ్, సురేష్ రాణా, కేశవ్ పాల్, రాజేశ్వర్ తదితరులు ముందంజలో కొనసాగుతున్నారు.
ఉదయం 8.30 గంటల సమయానికి యూపీలో బీజేపీ 80కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా.. సమాజ్ వాదీ పార్టీ కూటమి 48 స్థానాల్లో, బీఎస్పీ 3 చోట్ల, కాంగ్రెస్ 2 స్థానాలు, ఇతరులు మరో 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో 40 సీట్ల ముందంజలో బీజేపీ కొనసాగుతుండగా.. ఎస్పీ 25 స్థానాల్లో కొనసాగుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో (UP Elections Counting) మరికాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ మొదలుకానున్న వేళ అప్పుడే కౌంటింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓట్లు లెక్కించే సిబ్బంది సహా అభ్యర్థుల అనుచరులు, పార్టీల ఏజెంట్లు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
Background
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో యూపీపైనే అందరి దృష్టి ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాల లెక్కింపు కోసం 75 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఉత్తర్‌ప్రదేశ్ (UP Election Result 2022) సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఏబీపీ- సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఓసారి చూద్దాం.
యూపీలో కమలం (BJP In UP)
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం యూపీలో మళ్లీ భాజపా సర్కార్ రానున్నట్లు తేలింది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో భాజపా మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. భాజపా 228 నుంచి 240 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 14 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 6 నుంచి 10 సీట్లకే సరిపెట్టుకోనున్నట్లు తేలింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022
ఏబీపీ న్యూస్, సీఓటర్ ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -