Unsatisfied leaders are seen in both parties in Krishna district : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే వారు. అయితే ఆయనను బదిలీ చేశారు. కొత్తగా వైసీపీ నుంచి ఆసిఫ్ సమన్వయకర్తగా నియమించారు. దాంతో వెల్లంపల్లి అనుచరులు అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ, జనసేన కూటమిలో పోత్తులో భాగంగా జనసేన కేటాయించే అవకాశం ఉంది. జనసేన నుంచి పోతిన మహేష్, షేక్ గయాజుద్దీన్ సీటు ఆశిస్తున్నారు. అయితే ఈ సీటును టీడీపీకి కేటాయించడంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న ఇద్దరూ తమకే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. జలీల్ ఖాన్ తో వైసీపీ నేతుల సంప్రదింపులు జరిపారు. ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీ మారబోనని ఆయన చెబుతున్నరు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును వైసీపీ నుంచి సమన్వయకర్తగా నియమించారు. అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ నుంచి బొండా ఉమకు టిక్కెట్ ఖరారు చేశారు. విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ ను ఖరారు చేశారు. వైసీపీ నుంచి సమన్వయకర్తగా ఉన్న అవినాష్ ఉన్నారు. అయితే యలమంచిలి రవి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంనుంచి జడ్పీటీసీగా సరణల తిరుపతిరావు సమన్వయకర్తగా నియామించారు. అయితే తానే పోటీ చేయాలని జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున దేవినేని ఉమా ఉన్నారు. కానీ టీడీపీలో చేరబోతున్న వసంత కృష్ణప్రసాద్ సీటు ఆశిస్తున్నారు. అలాగే బొమ్మసాని సుబ్బారావు అనే నేత కూడా తనకే చాన్స్ కావాలంటున్నారు. జనసేన నుంచి అక్కల రామ్మోహన్ గాంధీ అనే నేత .. తమ పార్టీకి మైలవరం కేటాయించాలంటున్నారు. ఇక నందిగామ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారు. టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. జగ్గయ్యపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభాను ఉన్నారు. ఆయనకు టిక్కెట్ ఖరారు చేయలేదు. టీడీపీ తరపున శ్రీరామ్ తాతయ్యను అభ్యర్థిగా ప్రకటించారు.
తిరువూరు వైసిపి నుంచి స్వామి దాసును సమన్వయకర్తగా నియమించారు. దీంతో వైసిపికి దూరంగా ఉంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి. టిడిపి నుంచి అభ్యర్థిగా కొలికపుడి శ్రీనివాసరావును ప్రకటించారు. టిడిపి నుంచి సీటు ఆశించిన శ్వావల దేవ దత్త సైలెంట్ అయిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారునికి మచిలీపట్నం సీటును జగన్ కేటాయించారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేయనున్నారు. అయితే బండి రామకృష్ణ జనసేనకు కేటాయించాలని అడుగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఉప్పాల రమేష్(రాము ) ఉప్పల హారిక జడ్పీ చైర్ పర్సన్. సమన్వయకర్తగా నియామమించారు. టిడిపి నుంచి సీటు ఆశించిన వేదవ్యాస్.. కాగిత కృష్ణ ప్రసాద్ కు సీటు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన వైసీపీలో చేరి.. పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కొడాలి నాని తనకే సీటు వస్తుందని ధీమాతో ున్నారు. అయితే ప్రచారంలోకి వచ్చిన మరో పేరు హనుమంతరావు.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకూ టెన్షన్ కొనసాగనుంది. టిడిపి నుంచి వేనుగండ్ల రాముకు కేటాయించారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. కానీ దుట్టా కుటుంబం తమకు చాన్సివ్వాలని కోరుతోంది. టిడిపి నుంచి యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఖరారు అయింది. అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబును మచిలపట్నం ఎంపీ ఇంచార్జ్ గా నియమంచారు. వైసీపీ సమన్వయకర్తగా సింహాద్రి చంద్రశేఖర్ నియామించారు. కానీ ఆయన నియోజకవర్గంలో తిరగడం లేదు. జనసేనకు కేటాయించడంతో. టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ ను వైసీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారు.
కైకలూరు- నుంచి వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న దూలం నాగేశ్వరరావు ఉన్నారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే టిడిపి నుంచి పిన్నమనేని కుటుంబం కూడా పోటీకి ప్రయత్నిస్తోంది. నూజివీడువైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు.. తనకే సీటు వస్తుందని ధీమాతో ఉన్నారు. టిడిపి నుంచి కొలుసు పార్థసారధికి టికెట్ కేటాయించచారు. దీంతో టిడిపిని వీడిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు..ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేష్ కు సమన్వయకర్తగా నియామించారు. కానీ స్థానిక నేతలపైనా పడమట సురేష్ బాబు సహకరించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ తరపున పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. పామర్రు నియోజకవర్గం నుంచి న్న సిట్టింగ్ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ , టిడిపి నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేయనున్నారు.