Telangana Next CM Revanth Reddy in Race: హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనేది తేల్చడంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. నేటి సాయంత్రం కాంగ్రెస్ పెద్దలు కొందరు హైదరాబాద్ కు వచ్చి సీఎల్పీ నేతని ప్రకటించి సీఎంపై స్పష్టత ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఎల్లా హోటల్‌ నుంచి  రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. నేటి రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం రేసులో తామూ ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం పట్టు వీడటం లేదు. ఈ క్రమంలో రెండు రోజులుగా హోటల్ నుంచి బయటకు రాని రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.