Jagan Will Participate Eluru Siddham Meeting : రానున్న ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్ధేశంతో అధికార వైసీపీ(YSRCP) సిద్ధం(Siddham) పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. తొలి సభను విశాఖ(Vizag) జిల్లాలలోని సంగివలసలో నిర్వహించిన వైసీపీ.. కేడర్‌ భారీగా తరలిరావడంతో ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించే ఉద్ధేశంతో మరిన్ని సభలు నిర్వహణకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో సభను ఏలూరు - దెందులూరు(Denduluru) మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.


శనివారం సాయంత్రం ప్రారంభం కానున్న ఈ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jagan)పాల్గొని కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు-దెందులూరు మద్య నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా పరిధిలోని 50 నియోజకవర్గాలు నుంచి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. 


110 ఎకరాల్లో సభా ప్రాంగణం


తొలి సభ విజయవంతం కావడంతో రెండో సభను అంతకుమించి నిర్వహించేలా వైసీపీ ఏర్పాట్లు చేసింది. ఏలూరు నగర శివారు ఆటోనగర్‌ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు కనీసం మూడు లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 110 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో సభకు వచ్చే వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు గంటలకు రానున్నారు. సభ ఏర్పాట్లను అత్యంత వేగంగా పూర్తి చేశారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, మేకా వెంటక ప్రతాప్‌ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, జెడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మ శ్రీ తదితరులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 


చేసిన అభివృద్ధి చెప్పుకునేలా


సభకు హాజరుకానున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కేడర్‌కు సూచించనున్నారు. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరవుతారని పార్టీ నాయకులలు అంచనా వేస్తున్నారు. ఐదు లక్షల మందిని సమీకరించేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 నియోజకవర్గాలు పరిధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 20 వేల మందిని సభకు తీసుకువచ్చేలా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కనీసం పది వేలు మందిని తరలించినా ఐదు లక్షల మంది అవుతారని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.


Also Read: కాకినాడ ఎంపిగా జనసేనాని- సంచలనం రేపుతున్న పవన్ కల్యాణ్‌ నిర్ణయం!


Also Read: వైసీపీ 6వ జాబితా విడుదల, ఇంఛార్జ్‌లుగా 10 మందికి అవకాశం