AP Elections Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు అంటే రెండు గంటల్లో పది శాతం పోలింగ్‌ నమోదు అయింది. 


జిల్లాల వారీగా పోలింగ్ శాతం పరిశీలిస్తే... నంద్యాల జిల్లావ్యాప్తంగా ఉదయం 9గంటల వరకు 5.10శాతం పోలింగ్ నమోదు అయింది. ఆళ్లగడ్డలో- 4.90శాతం, బనగానపల్లిలో-5.32శాతం, డోన్‌లో 4.75శాతం, నందికొట్కూర్‌లో 4.29శాతం, నంద్యాలలో 5.22శాతం, శ్రీశైలంలో 6.21శాతం పోలింగ్ నమోదు అయింది. 


ఉమ్మడి అనంతపురం జిల్లా లో ఉదయం 9 గంటలకు వరకు 9.18 శాతం పోలింగ్ నమోదు అయింది. సత్యసాయి జిల్లా లో 6.92 శాతం, తిరుపతి జిల్లా 8.11 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగాై 8.95 శాతం పోలింగ్ నమోదు కాగా... అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలిస్తే... తిరువూరులో 10 శాతం, విజ‌య‌వాడ ప‌శ్చిమలో 11 శాతం, విజ‌య‌వాడ సెంట్రల్‌లో 8.09 శాతం, విజ‌య‌వాడ తూర్పులో 12 శాతం, మైల‌వ‌రంలో 6 శాతం, నందిగామలో 4.46 శాతం, జగ్గయ్యపేటలో 11 శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లా మొత్తం మీద పోలింగ్ శాతం: 8.95 శాతం. 


ఉదయం ఆరు గంటలకే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మహిళలే భారీగా బార్లు తీరారు. పల్నాడు లాంటి ప్రాంతాల్లో పలు పోలింగ్ స్టేషన్ల వద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అంతా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది.